మన దేశంలో భిక్షాటన కొత్త విషయం కాదు. బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, రోడ్లపై ఎక్కడ చూసినా బిచ్చగాళ్లు కనిపిస్తారు. ఎక్కువ మంది జీవనోపాధి కోసం భిక్షాటన చేస్తారు. కానీ ముంబై (Mumbai – Beggar) కి చెందిన భరత్ జైన్ కథ మాత్రం విభిన్నంగా ఉంటుంది. భిక్షాటననే వృత్తిగా ఎంచుకున్న ఈ వ్యక్తి, కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టాడు. ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా అతను గుర్తింపు పొందాడు.చిన్ననాటి నుంచే పేదరికం భరత్ జైన్‌ను వెంటాడింది. చదువు లేదా ఉద్యోగం చేసే అవకాశం రాలేదు. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అతని భుజాలపై పడింది. ఈ పరిస్థితుల్లో జీవనం కోసం చివరి మార్గం భిక్షాటనగా మారింది.

రోజువారీ ఆదాయం ఆశ్చర్యపరుస్తుంది
భరత్ జైన్ (Bharat Jain) రోజుకు 10 నుంచి 12 గంటల వరకు భిక్షాటన చేస్తాడు. అతని రోజువారీ ఆదాయం రూ.2,000 నుంచి రూ.2,500 మధ్య ఉంటుంది. నెలాఖరులో ఈ మొత్తమే రూ.60,000 నుంచి రూ.75,000 అవుతుంది. ఒక చిన్న ఉద్యోగి కూడా పొందలేని ఆదాయం భరత్ సంపాదిస్తాడు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జైన్ సంపాదనను వృథా చేయలేదు. బదులుగా, దానిని జాగ్రత్తగా ఆదా చేసి పెట్టుబడులు పెట్టాడు. ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. దాని విలువ రూ.1.2–1.4 కోట్లు అని చెబుతున్నారు. అదేవిధంగా థానేలో రెండు దుకాణాలను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఆస్తుల విలువ రూ.1 కోటి దాటింది. మొత్తం మీద అతని నికర ఆస్తి రూ.7.5 కోట్లకు చేరుకుంది.
కుటుంబ జీవితం విలాసవంతంగా
భరత్ జైన్ ఇప్పుడు భార్య, ఇద్దరు కుమారులు, సోదరుడు, తండ్రితో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తన పిల్లలను కాన్వెంట్ పాఠశాలలో చదివించాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల కోసం ఒక స్టేషనరీ దుకాణాన్ని ప్రారంభించాడు. దీంతో కుటుంబ ఆదాయం మరింత పెరిగింది.ఇంత ఆస్తి, డబ్బు ఉన్నప్పటికీ జైన్ భిక్షాటన మానేయలేదు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఆపినా వినలేదు. “ఈ వృత్తి కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నాను. అందుకే దానిని వదిలిపెట్టలేను” అని స్పష్టంగా చెబుతున్నాడు.
ఇతర భిక్షగాళ్ల విజయాలు కూడా
భరత్ జైన్ మాత్రమే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కొందరు భిక్షగాళ్లు కూడా లక్షల ఆస్తులు కూడబెట్టారు. కోల్‌కతాకు చెందిన లక్ష్మి, ముంబైకి చెందిన గీత వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కానీ భరత్ జైన్ కథ ప్రత్యేకమైంది. ఎందుకంటే కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన తొలి బిచ్చగాడు అతనే.పేదరికంలో జీవితం ప్రారంభించిన భరత్ జైన్, భిక్షాటన ద్వారానే ధనవంతుడయ్యాడు. జాగ్రత్తగా డబ్బు ఆదా చేసి పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ స్థాయికి చేరాడు. అతని కథ సామాన్య ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఆలోచింపజేస్తుంది కూడా.
Read Also :