వరకట్న (Dowry) దాహానికి ఎందరో వివాహితులు ఆహుతి అయ్యారు. ఈ వరకట్న నిషేధానికి ఎన్ని చట్టాలు ఉన్నా ప్రజల్లో వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ చట్టం నీరిగారిపోతున్నది. కట్నం లేనిది పెళ్లి జరిగేది లేదంటూ తెగేసి చెబుతున్న పెళ్లికొడుకు, అతనికుటుంబంపై ఎవరు కేసు వేస్తున్నారు? అలాంటివారిని చట్టం ముందుకు తీసుకొచ్చేది ఎవరు? పెళ్లి అంటే గొంతెమ్మ కోరికలన్నితీర్చుకోవడమేనా?
Israel Gaza: మళ్ళిగాజా పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఆరుగురు మృతి
పెళ్లి కూతురు అంటే నగలు, డబ్బుతో పాటు ఆస్తిపాస్తులు, ఇంట్లో వాడే ప్రతి వస్తువు కావాలని పట్టుపడుతున్నారు.అయినా వీరిదేరాజ్యం. తాజాగా ఓ యువకుడు కట్నం వద్దు, మీ అమ్మాయే ముద్దు అంటే కళ్లకు అడ్డుకుని పెళ్లి (wedding) చేసుకోవాల్సింది పోయి.. నువ్వు వద్దు నీతో పెళ్లి వద్దు అని ఆ అమ్మాయి తెగేసి చెప్పింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
లోపం ఉందని తిరస్కరించిన వధువు
ఓ యువకుడికి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. వరుడికి వధువు నచ్చిది, వధువు కూడా వరుడు నచ్చాడు. ఇంకేమి ఉంది. అన్ని విషయాలుమాట్లాడుకున్నారు. రేంజ్ రోవర్ కారు, ఫ్లాట్ కట్నంగా ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. అయితే ఆ వరుడు వాటిని సున్నితంగా తిరస్కరించి, ‘మీ కూతురును ఇవ్వండి చాలు, ఇవన్నీ నాకు వద్దు’ అని చెప్పాడు.

దీంతో ఈ పెళ్లిని వధువు తరపున వారు రద్దు చేసుకున్నారు. కట్నం ఇచ్చినా వద్దని అంటున్నాడు అంటే ఇతనిలో ఏదో లోపం ఉందని వధువు బంధువులు అనుకుని, పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇదెక్కడి ఖర్మ అంటూ వరుడు వాపోతున్నాడు.
సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వరుడు
వరుడికి రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారం, రెస్టారెంట్లు, పబ్బులు ఉన్నాయి. అంతేకాదు అతనికి పూర్వీకుల నుంచి ఆస్తిం కూడా వారసత్వంగా వచ్చింది.. దీంతో అతను సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. తన ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఇక అమ్మాయి నుంచి డబ్బు ఎందుకు,తీసుకోవాలని భావించాడు.
అంతే కట్నం తీసుకోకుండా ఆదర్శంగా నిలవాలనుకున్న ఆ వరుడి కల కలగానే మిగిలిపోతుందేమో! ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదుకానీ, యువకుడు రెడ్డిట్ లలో పంచుకున్నారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: