మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో (Panna diamond) ఒక సాధారణ గనికారం జీవితాన్ని మార్చే సంఘటన చోటు చేసుకుంది. రెండు సంవత్సరాలుగా వజ్రాల కోసం పోరాడుతున్న సావిత్రి సిసోడియా అనే మహిళకు ఆత్మవిశ్వాసం చివరకు ఫలించింది. ఆమె తవ్విన గనిలో 2.69 క్యారెట్ల ముడి వజ్రం (Diamond) లభ్యమవడం ఆమెకు ఆనందాన్ని ఇచ్చింది.పన్నా జిల్లా చోప్రా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ గనిలో సావిత్రి అవిశ్రాంతంగా పని చేస్తూ వజ్రం కోసం తవ్వకాలు సాగించారు. ఎండ, దుమ్ము లెక్కచేయకుండా ఆమె చేసిన కృషి ప్రస్తుతం ఫలాన్ని ఇచ్చింది. ఇది మా కుటుంబానికి జీవితం మార్చే కానుక, అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
వజ్రాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
ఆవిడ కనుగొన్న ముడి వజ్రాన్ని అధికారులు అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పన్నా డైమండ్ ఆఫీసర్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ, ఈ వజ్రాన్ని త్వరలో ప్రభుత్వ వేలంలో ఉంచుతాం. వచ్చిన మొత్తం నుంచి పన్నులు, రాయల్టీ తీసివేసిన తర్వాత మిగతా మొత్తం సావిత్రికి ఇస్తాం, అన్నారు.ఈ ముడి వజ్రం వేలంలో లక్షల రూపాయలు పలికే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆమె కుటుంబ ఆర్థిక స్థితిలో ఓ మైలురాయి సాధించే అవకాశం ఉంది. ఇది సావిత్రి జీవితాన్ని మరింత సుళువుగా మార్చనుందని ఆశిస్తున్నారు.
పన్నా.. వజ్రాల పుట్ట
పన్నా ప్రాంతం వజ్రాల కోసం దేశవ్యాప్తంగా పేరొందింది. ఇక్కడ తరచూ ఇటువంటి విలువైన వజ్రాలు లభిస్తుండటం ఇక్కడి ప్రజల ఆశలకు ఆస్తిగా మారింది. సావిత్రి లాంటి వారు ప్రతిరోజూ గనుల్లో శ్రమిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.
Read Also : Operation Midnight Hammer : 7 బీ2 విమానాలు..14 ఎంఓపీ బాంబులు..