దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్(PM Kisan) సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు మరో దశకు చేరుకున్నాయి. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశంలో విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా మొత్తం రూ.18,000 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హత పొందిన ప్రతి రైతుకు రూ.2,000 చొప్పున అందుతుంది. దేశవ్యాప్తంగా 9 కోట్లకుపైగా మంది రైతులు ఈ పథకం లబ్ధిదారులు.
ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 20 విడతలలో 11 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.3.70 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేయడం జరిగింది.
Read Also: TG: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఒకే సారి 130 మందికి ప్రమోషన్లు..

ఈవిడత నిధులు పొందాలంటే..
ఈ పథకం కింద డబ్బులు పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికీ ఇది పూర్తి చేయని వారు ఇలా చేయవచ్చు:
- PM Kisan పోర్టల్ (pmkisan.gov.in)లో ఆధార్ OTP ద్వారా e-KYC పూర్తి చేయండి.
- సమీపంలోని CSC లేదా SSK కేంద్రాల్లో బయోమెట్రిక్ ఆధారంగా e-KYC పూర్తి చేయవచ్చు.
- పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా Face Authentication కూడా అందుబాటులో ఉంది.
అయితే, ముందుగా రైతు భూమి వివరాలు రిజిస్టర్ అయి ఉండాలి మరియు బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ చేయబడాలి.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
21వ విడత డబ్బులు జమయ్యాయో లేదో తెలుసుకోవడానికి:
- PM-Kisan వెబ్‌సైట్ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో “Farmer’s Corner” → “Know Your Status” సెక్షన్ క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి,
- మీ మొబైల్‌కు వచ్చిన OTP నమోదు చేస్తే మీ పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
గ్రామ లబ్ధిదారుల జాబితా ఎలా చూడాలి?
- PM-Kisan పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
- “Farmer’s Corner” → “Beneficiary List” పై క్లిక్ చేయండి.
- రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఎంటర్ చేసి “Get Report” నొక్కితే గ్రామ లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
డబ్బులు రాకపోతే?
స్టేటస్‌లో ‘Pending’ అని చూపిస్తే మీ అప్లికేషన్‌లో లోపాలు ఉన్నట్లు అర్థం.
అవసరమైతే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ 155261 / 011-24300606కు కాల్ చేయండి.
బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయండి.
e-KYC పూర్తయిందో లేదో పరిశీలించండి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: