జాతీయ విద్యా విధానంలో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే(uddhav thackeray), మహారాష్ట్ర నవనిర్మాణ సేవా (MNS) అధినేత రాజ్ ఠాక్రే (Raj thackeray) వ్యతిరేకించారు. ఇది స్థానిక భాషా విశిష్టతపై దాడిగా భావించారు. ఈ క్రమంలోనే వీళ్లద్దరూ కలవనున్నారు. శనివారం వర్లీలోని నిరసన చేయనున్నారు.

ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇప్పటికే వేరు వేరు రోజుల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. జులై 6న విరాట్ మోర్చా చేపడతామని రాజ్ ఠాక్రే ప్రకటించారు. జులై 7న తాము ఆందోళన చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ క్రమంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ వీళ్లిద్దరితో చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండు పార్టీలు ఒకే వేదికపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయాలని నిర్ణయించారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక మలుపు నిలవనుందని ఎంఎన్‌ఎస్ ముఖ్యనేత సందీప్ దేశ్‌పాండే అన్నారు.
రాజకీయ డ్రామా
మరోవైపు ఈ వ్యవహారంపై శివసేన (ఏక్‌నాథ్ షిండే) బీజేపీ నేతలు స్పందించారు. ఇది రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ డ్రామా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. హిందీని ఎవరూ తప్పనిసరి చేయలేదని.. అన్ని స్కూ్ళ్లలో మరాఠీ తప్పనిసరిగా బోధిస్తారని.. హింది భాష ఆప్షనల్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Saif Ali Khan: సైఫ్ కు చేజారిన రూ.15 వేల కోట్ల ఆస్తులు