మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. థాక్రే సోదరులు (ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే) మళ్లీ కలిశారు (Thackeray Cousins). దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్నారు.ఇకపై ఇద్దరం కలిసే ఉంటామని ఈ సందర్భంగా సోదరులు స్పష్టం చేశారు.త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ ముంబైలో ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ (‘Voice of Marathi’) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే , మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే ఇద్దరూ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ (Thackeray Cousins)ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. 2005లో విడిపోయిన ఈ ఇద్దరు అన్నదమ్ములు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలుసుకోవడం మహా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అన్నదమ్ముల కలయికపై ఇరు పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్ వల్లే
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వల్లే తాము కలిశామని రాజ్ థాక్రే వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమే తమని కలిపిందన్నారు. అనుకోకుండానే ఒకే వేదికపై చేర్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై థాక్రే సోదరులు (Thackeray Cousins)తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై తామిద్దరం ఒక్కటిగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, అన్నదమ్ములిద్దరూ చివరి సారిగా 2005లో ఒకేవేదికపై కనిపించారు. ఆ తర్వాత శివసేనలో గొడవల కారణంగా రాజ్ థాక్రే పార్టీ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను స్థాపించారు.
Read Also: hindi.vaartha.com
Read Also: Mysore: మైసూరులో ప్రేమోన్మాది దారుణం – నిరాకరించిందన్న కోపంతో