తెలంగాణ (TG) రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత వేగంగా పెరగబోతోంది. ప్రభుత్వం గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, 12 నేషనల్ హైవేస్‌పై ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పీఎం ఈ-డ్రైవ్ (PM e-Drive) పథకం కింద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా, వాటిలో 12 మార్గాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: TG: నీట మునిగిన కాలనీల్లో బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి పర్యటన

ఇందులో NH44 (ఆదిలాబాద్–మహబూబ్‌నగర్), NH65 (జహీరాబాద్–కోదాడ), NH163 (వికారాబాద్–ములుగు), NH765 (హైదరాబాద్–దిండి) వంటి ముఖ్యమైన రహదారులు ఉన్నాయి. అయితే NH150 (సంగారెడ్డి) రూట్‌ను ఈ జాబితా నుంచి మినహాయించారు. ఈ మార్గాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులకు పెద్ద సౌలభ్యం లభించనుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అత్యవసరంగా మారింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుతో పాటు కేంద్రం నుండి రాయితీలు (subsidies) కూడా లభించనున్నాయి. ఈ రాయితీలతో ప్రైవేట్ కంపెనీలు, స్టార్ట్‌అప్స్ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: