జమ్మూ కశ్మీర్ పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.అయితే, ఈ ఉగ్రవాదులు కొన్ని సార్లు భద్రతా దళాల కంటపడి తిరిగి తప్పించుకుంటున్నారు.వారి కదలికలను నాలుగుసార్లు గుర్తించినప్పటికీ, దట్టమైన అడవుల మధ్య వారు బేధం కావడం ఆందోళన కలిగిస్తోంది.ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి.

దట్టమైన అడవుల్లో కొనసాగుతున్న వేట
దక్షిణ కశ్మీర్‌లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు అత్యంత సమీపంగా చేరుకున్నప్పటికీ, వారు ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు.స్థానికుల నుంచి అందిన సమాచారంతో,ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కదలికలను అంచనా వేస్తున్నాయి.“ఇది దోబూచులాట లాంటి స్థితి.వారు మమ్మల్ని కనపడినా, కాల్పులు జరిపి తప్పించుకుంటున్నారు.అడవులు చాలా దట్టంగా ఉండటం వారికి అనుకూలంగా ఉంటుంది.వారిని తక్కువ రోజుల్లో పట్టుకుంటాం,అని ఒక సీనియర్ సైనిక అధికారి చెప్పారు.
పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు
ఉగ్రవాదులు మొదట పహల్గాం తహసీల్ పరిసర ప్రాంతాల్లో కనిపించారు.బలగాలు అక్కడ చేరుకోవడానికి ముందు వారు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు.తరువాత వారి కదలికలు కుల్గాం అడవుల్లో కనిపించాయి.అక్కడ కూడా వారు కాల్పులు జరిపి తప్పించుకున్నారు.తదుపరి, త్రాల్ కొండల్లో వారి ఉనికిని గుర్తించినప్పటికీ,వారు అక్కడి నుంచి కూడా జారుకున్నారు.తాజాగా, కొకెర్నాగ్ ప్రాంతంలో కూడా ఉగ్రవాదుల కదలికలు గుర్తించబడ్డాయి.ఈ ప్రాంతంలో వారి ఉనికిని గుర్తించి, బలగాలు వాటిని వెంటాడి పోతున్నట్లు అధికారులు తెలిపారు.
నిత్యావసరాల సేకరణలో జాగ్రత్త
ఉగ్రవాదులు తమకు అవసరమైన నిత్యావసరాల సేకరణలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.వారు పర్యాటకుల నుండి మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.ఈ ఫోన్లు తమ సహచరులతో మాట్లాడేందుకు ఉపయోగపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నారు.దీనిపై టెక్నికల్ ఇంటెలిజెన్స్ బృందాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని తెలుస్తోంది.భద్రతా బలగాలు, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పహల్గాం చుట్టూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ఉగ్రవాదులు కిష్ట్‌వార్ ప్రాంతంలోకి చేరుకుంటే, అక్కడి పర్వత ప్రాంతాలు, తక్కువ మంచు కారణంగా దట్టమైన అడవుల్లోకి సులభంగా చేరుకునే అవకాశం ఉంది.ఇది భద్రతా బలగాలకు మరింత సవాల్ గా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి, మరియు భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి.
Read Also : Rajnath Singh : ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలుసుకున్న రాజ్ నాథ్ సింగ్