Supreme Court: ఏదైనా ఒక కేసు కోర్టు గడప ఎక్కితే ఇక దానిపై తీర్పు రావాలంటే సంవత్సరాలుగా వేచి ఉండాల్సిందే. సామాన్య మానవుడు నైతం కోర్టులో కేసు ఉందంటే ఇక ఎప్పటికో తీర్పు.. దానిపై నమ్మకాలను పెట్టుకోవడం వృధా అనే భావన వ్యక్తం చేస్తుంటారు. ఇదే ఆవేదనను సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. దేశంలోని పలు హైకర్టులు తీర్పులు వెలువరించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ ముగిసి, తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత నెలలు, సంవత్సరాల తరబడి వెలువరించకపోవడం న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జాప్యాన్ని నివారించేందుకు అత్యున్నత న్యాయస్థానం కీలకమైన మూర్గదర్శకాలను జారీచేసింది.

మూడునెలల్లోగా తీర్పును వెలువరించాలి
జస్టిస్ సంజయ్ కోరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఏదైనా కేసులో తీర్పును రిజర్వ్ చేసిన మూడునెలల్లోగా వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ గడువులోగా తీర్పు రాకపోతే, సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్(Registrar General of the High Court) ఆ విషయాన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించింది. అప్పుడు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని, సంబంధిత బెంచ్ ను రెండు వారాల్లోగా తీర్పు ఇవ్వాలని కోరాలని సూచించింది. ఆ గడువులోగా కూడా తీర్పు రాక పోతే, ఆ కేసును విచారణ కోసం మరో బెంచ్ కు బదిలీ చేయాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
2008నాటి క్రిమినల్ కేసులో విచారణ
అలహాబాద్ హైకోర్టులో 2008నాటి ఒక క్రిమినల్ అప్పీల్కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ముగిసి ఏడాది కావస్తున్నా తీర్పు వెలువడకపోవడం ‘తీవ్ర దిగ్భ్రాంతికరం, ఆశ్చర్యకరం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా హైకోర్టులలో తీర్పుల జాప్యంపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు సరైన యంత్రాంగం లేకపోవడం కూడా సమస్యను తీవ్రతరం చేస్తోందని అభిప్రాయపడింది. ప్రతి నెల రిజర్వ్ లో ఉండి, తీర్పు వెలువడని కేసులు బితాను రిజిస్ట్రార్ జనరల్స్ తప్పనిసరిగా చీఫ్ జస్టిస్కు అందించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. తమ తీర్పుప్రతిని దేశంలోని అన్ని హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్సుక్కు పంపి, ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
మూడు నెలల్లో తీర్పు రాకపోతే ఏం జరుగుతుంది?
మూడు నెలల్లో తీర్పు రాకపోతే, రిజిస్ట్రార్ జనరల్ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే ఆ కేసు మరో బెంచ్‌కు బదిలీ చేయబడుతుంది.
ఈ వ్యాఖ్యలు ఏ కేసు సందర్భంగా వచ్చాయి?
2008నాటి క్రిమినల్ అప్పీల్ కేసు విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :