Subramanian Swamy: రామసేతువును(Ram Sethu) జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక చర్యలు చేపట్టింది. ఈ వ్యాజ్యాన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రామసేతువును రక్షణ కల్పించడమే కాకుండా, అధికారికంగా జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ స్వామి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పురావస్తు శాఖ (ఏఎస్ఐ) డైరెక్టర్, తమిళనాడు ప్రాంతీయ ఏఎస్ఐ డైరెక్టర్‌కు నోటీసులు పంపింది. ఈ అంశంపై తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
సుబ్రహ్మణ్య స్వామి వాదనలు
స్వామి తరఫున సీనియర్ న్యాయవాది విభా దత్తా మఖిజా, న్యాయవాది సత్య సబర్వాల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటివరకు కేంద్రం తన విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్వామి స్పష్టంచేశారు. రామసేతువుకు ఉన్న మతపరమైన, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని దాన్ని రక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.గత సంవత్సరం జనవరిలోనే సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించిన స్వామి, అవసరమైన పత్రాలను సమర్పించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా, కేంద్రం స్పందించలేదని తెలిపారు. అనంతరం మే 13న సాంస్కృతిక మంత్రికి లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో, మళ్లీ సుప్రీంకోర్టు ద్వారానే న్యాయం కోసం వెళ్ళినట్లు ఆయన పేర్కొన్నారు.
రామసేతువు అంటే ఏమిటి?
రామసేతువు అనేది భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న ప్రాచీన రాతి నిర్మాణం. హిందూ పురాణాల ప్రకారం, ఇది శ్రీరాముడి సేన నిర్మించిన సేతువుగా భావిస్తారు.
సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఎందుకు ఆశ్రయించారు?
రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించి, దానికి తగిన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: