Social Media-నేపాల్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నది. ఆదివారం ఈ ఆందోళనలు మరింతగా పెరిగాయి. ఆందోళనకారులు పార్లమెంట్(Parliament) లోకి దూసుకెళ్లారు. పరిస్థిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోలనకు దిగాయి. జెన్-2 పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అక్కడి యువత చేపట్టింది. ఆందోలనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. ప్రధాని ఓలి తీరును ఆందోళనకారులు తప్పుపట్టారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోలనలు చేపట్టాయి.

సామాజిక మాధ్యమాలపై నిషేధం
ఖాట్మండుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోలనలు మిన్నంటాయి. దీంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ సమా పలు సామాజిక మాధ్యాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో నేపాల్ ప్రభుత్వం మొత్తం 26 యాప్స్ పై బ్యాన్ విధించింది. సోషల్ మీడియాపై బబ్యాన్ ఎత్తేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో అట్టుడుకిన నేపాల్
ప్రస్తుతం నేపాల్లో కర్ఫ్యూను(Curfew) విధించారు. ప్రస్తుతం ఖాట్మండుతో పాటు విరాట నగర్, భరత్ పూర్, పోఖ్రా వంటి 10 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిషేధం మానవ హక్కులు, పత్రికాస్వేచ్ఛా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం వాక్ స్వేచ్ఛను అడ్డుకుంటుందని, వ్యాపారాలకు హాని కలిగిస్తుందని ఆరోపించింది.
వారం రోజులు గడువు ఇచ్చినా నమోదు కాని రిజిస్ట్రేషన్లు కోర్టు ఆదేశం మేరకు రిజిస్ట్రేషన్(Registration) చేసుకోవడానికి కంపెనీలకు ఏడు రోజుల సమయం ఇచ్చామని, అయితే అవన్నీ గడువులో నమోదు చేసుకోవడంలో విఫలమైనట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్లనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించామని మంత్రిత్వశాఖ పేర్కొంది. టిక్ టాక్తో సహా ఐదు కంపెనీలు మాత్రమే ఆ ఆదేశాన్ని పాటించాయి. వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. నేపాల్లోని ప్రజలు పెద్దసంఖ్యలో విదేశాల్లో నివసిస్తున్నారు. దీంతో తమ కుటుంబీకులతో మాట్లాడేందుకు అవకాశం లేకపోవడందో ఈ ఆందోళనలు పెరిగేందుకు మరో కారణంగా చెప్పొచ్చు.
నేపాల్‌లో సోషల్ మీడియాపై ఎందుకు నిషేధం విధించారు?
దేశంలో భద్రతా కారణాలు, అశాంతి వాతావరణం నివారించడానికి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం విధించింది.
ఏ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలపై నిషేధం అమలు చేస్తున్నారు?
ఫేస్‌బుక్, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలపై నిషేధం కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: