Rahul: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తేవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీనే సరైన నాయకుడని తాజా సర్వేలో తేలింది. ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన “మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో పాల్గొన్న వారిలో 28.2% మంది రాహుల్ గాంధీని ప్రతిపక్షానికి ఉత్తమ నాయకుడిగా(best leader) అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ 7.7% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (6.7%), ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (6.4%), కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (4.4%) తదుపరి స్థానాల్లో ఉన్నారు.

రాహుల్ ఆదరణ పెరుగుదల
గత సర్వేలతో పోల్చితే రాహుల్ గాంధీకి మద్దతు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2024 ఫిబ్రవరిలో ఆయనకు 23.9% మద్దతు లభించగా, 2025 ఆగస్టు సర్వేలో అది 28.2%కి చేరింది. అయితే 2023 ఆగస్టులో నమోదైన 32.3%తో పోలిస్తే కొంత తక్కువగానే ఉందని చెప్పవచ్చు.లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) పనితీరుపై కూడా ప్రజల అభిప్రాయం మెరుగ్గా మారింది. ఆయన పనితీరు “అద్భుతంగా ఉంది” అని చెప్పిన వారి శాతం 25% నుంచి 28%కి పెరిగింది. అదే సమయంలో, “బాగాలేదు” అని చెప్పిన వారి శాతం 27% నుంచి 15%కి తగ్గింది. ఈ సర్వేలో మరో 22% మంది ఆయన పనితీరు “బాగుంది” అని, 16% మంది “సాధారణం” అని అభిప్రాయపడ్డారు. ఈ సర్వే 2025 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో జరిగింది. మొత్తం 2,06,826 మంది స్పందనల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.
మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో రాహుల్ గాంధీకి ఎంత శాతం మద్దతు వచ్చింది?
ఈ సర్వేలో రాహుల్ గాంధీకి 28.2% మంది మద్దతు తెలిపారు.
రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువ మద్దతు పొందిన ప్రతిపక్ష నేత ఎవరు?
మమతా బెనర్జీ 7.7% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :