Rahul Mamkootathil: కేరళ రాజకీయాల్లో మరోసారి వివాదం తలెత్తింది. పాలక్కాడ్ ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్ నేత రాహుల్ మామ్కూటత్తిల్‌పై ట్రాన్స్‌జెండర్ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సంచలన ప్రకటనలు చేశారు. తనను అత్యాచారం చేయాలనుకున్న ఉద్దేశంతో అసభ్యకర సందేశాలు పంపారని ఆమె వెల్లడించారు. ఈ పరిణామాల వెంటనే రాహుల్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆ ట్రాన్స్‌జెండర్(Transgender) మహిళ మాట్లాడుతూ రాహుల్‌తో మొదట పరిచయం ఎన్నికల చర్చ కార్యక్రమంలో ఏర్పడిందని, ఆ స్నేహం తర్వాత సోషల్ మీడియా ద్వారా అసహ్యకర అనుభవంగా మారిందని తెలిపారు. “నన్ను రేప్ చేయాలనుకుంటున్నానని అతడు అన్నాడు. బెంగళూరు లేదా హైదరాబాద్‌కు వెళ్దామని సూచించాడు. ఆయన లైంగిక అసంతృప్తితో ఉన్నారనిపించింది” అని ఆమె వాదించారు.

రాహుల్ పై లైంగిక ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి
రాహుల్‌పై ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా ఎదురయ్యాయి. మలయాళ నటి రిని ఆన్ జార్జ్ (Rini Ann George)ఆయన అసభ్యకర సందేశాలు పంపారని ఆరోపించగా, తరువాత రచయిత్రి హనీ భాస్కరన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. పార్టీకి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, డీవైఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. వరుస ఆరోపణలతో రాహుల్‌పై ఒత్తిడి పెరిగింది.
అయితే రాహుల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలపై పార్టీ దృష్టి సారించేందుకు తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. ఈ వ్యవహారంపై కేరళ మంత్రి ఆర్. బిందు స్పందిస్తూ, ఎమ్మెల్యే పదవికీ రాహుల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఆయన ప్రజాప్రతినిధి స్థానంలో కొనసాగడం సరికాదని మంత్రి అన్నారు.
ఆరోపణల నేపథ్యంలో రాహుల్ ఏ నిర్ణయం తీసుకున్నారు?
రాహుల్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల స్పందన ఎలా ఉంది?
కేరళ మంత్రి ఆర్. బిందు, రాహుల్ తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన పదవిలో కొనసాగకూడదని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: