భారత్-పాకిస్తాన్ లమధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ యుద్ధంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మనదేశం పాకిస్తాన్వి మానాలపై గగనతల నిషేధాన్ని విధించింది. దీంతో పాకిస్తాన్ కూడా భారత విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని విధిస్తున్నది. తాజాగా ఈ నిషేధాన్ని సెప్టెంబర్ 23 వరకు పొడుగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పహల్గాం దాడితో రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ (India-Pakistan)లమధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 23న ఒక నెలపాటు భారత విమానాలు ఏవీ తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ నిషేధం విధించింది. దీనికి ప్రతీకరంగా ఏప్రిల్ 30న పాక్ విమానాలు ఏవీ భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం
విధించింది. అప్పటి నుంచి పాకిస్తాన్ నిషేధం గడువును పెంచుతూనే ఉంది. తాజాగా పాక్ మరోసారి ఈ నిషేధాన్ని ఒకనెలపాటు పొడిగించింది. దీని క్రారం పాకిస్తాన్ఎ యిర్ లైన్కు చెందిన విమానాలతోపాటు, ఆ దేశ సైనిక విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలో ప్రవేశించడానికి అవకాశం లేదు.

నష్టాలతో ఉర్కిరిబిక్కిరి అవుతున్న పాక్
భారత విమానాలపై గగనతల నిషేధాన్ని విధించడం విధించడం వల్ల పాక్ ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆగస్టులో పాక్ రక్షణ మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక ప్రకారం, ఎయిర్స్పేస్ మూసివేత వల్ల ఆ దేశానికి దాదాపు రూ.126 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అంతేకాక ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో 4.10 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు (ఇండియన్ కరెన్సీలో రూ.126 కోట్లు వాటిల్లిందని పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ కూడా పేరొకింది. పహల్గాంలో 26మందిని పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ ఇప్పటికీ ఈ నేరం తమది కాదని బుకాయిస్తూనే ఉంది. భారతదేశం ఎన్నో ఆధారాలను ప్రపంచ దేశాలకు చూపిస్తున్నా పాక్ మాత్రం పహల్గాం దాడులతో(Pahalgam attacks) తమకు సంబంధం లేదని అబద్దాలు చెబుతున్నది. అమెరికా వంటి దేశాలు ఈ దాడికి పాకిస్తాన్ దే బాధ్యత అని ఘటాపధంగా అంటున్నా పాక్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు.
ఈ గగనతల నిషేధం వల్ల పాకిస్తాన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లింది?
ఈ నిషేధం వల్ల పాకిస్తాన్‌కు రూ.126 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అక్కడి రక్షణ మంత్రిత్వశాఖ నివేదిక పేర్కొంది.
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ స్పందన ఏమిటి?
పాకిస్తాన్ ఇప్పటికీ పహల్గాం దాడిలో తమ ప్రమేయం లేదని తెలిపినా, భారత్ పలు ఆధారాలు చూపించడమే కాకుండా అంతర్జాతీయంగా పాక్‌ను బట్టబయలు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: