KP Sharma Oli-ఎట్టకేలకు నేపాల్ ప్రధాని రాజీనామాగత మూడురోజులుగా నేపాల్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజానీమా చేయాల్సి వచ్చింది. ఈ సాయంత్రం కొత్త ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఉంది. సైన్యం సూచనతో రాజీనామా(Resignation) చేస్తున్నట్లుగా కేపీ శర్మ ఓలి తన రాజీనామా ప్రకటనలో వెల్లడించారు. వందలాదిమంది ప్రదర్శనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తన కార్యాలయంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఓలి తన పదవి నుంచి తప్పుకున్నారు.

సోషల్ మీడియా నిషేధంతో మొదలైన నిరసనలు
ఇటీవల ప్రభుత్వం ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, వాట్సాప్ వంటి 36 సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై సిషేధం విధించడాన్ని నిరసిస్తూ నేపాల్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో, నిరసనకారులు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. పార్లమెంట్ భవనాన్ని ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు. ఈ ఘటనల్లో దాదాపు 20 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు.
దేశశాంతి భద్రత కోసమే రాజీనామా: ఓలీ నేపాల్ లో నిరసనకారులు విద్వంసాలకు పాల్పడ్డారు. దీంతో 20 మంది మరణించగా, 300మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోయినట్లు సమాచారం. దీంతో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్గెల్ ప్రధాని ఓలీని రాజీనామా చేయమని సూచించినట్లు సమాచారం. దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రధాని రాజీనామా చేయడమే ఏకైక మార్గమని సైన్యం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో సైన్యం సూచన మేరకు ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు తాను రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇతర మంత్రులు కూడా రాజీనామా
ప్రధాని ఓలీ రాజీనామాకు ముందు హోంమంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని ఓలీ దేశం విడిచి దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని, వైద్య చికిత్స పేరుతో ఆయన దుబాయ్ (Dubai)వెళ్లేందుకు ప్రైవేట్ ఎయిర్లైన్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. కాగా గతవారం సోషల్ మీడియాలోని కొన్నింటిని నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో దేశంలో నిరసన జ్వాలలు రగిలాయి. నేపాల్ ప్రజలు ప్రపంచంలోనే అనేక దేశాల్లో నివసిస్తున్నారు. వాట్సాప్, ట్విట్టర్ వంటి మీడియాలపై నిషేధం ఉండడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ప్రభుత్వం మీడియాపై నియంత్రణ చేస్తున్నదని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నదని ఆరోపిస్తూ, పౌరులు ఆందోళనలు మొదలుపెట్టారు. దీన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవడంతో ప్రజల్లో మరింత నిరసన వ్యక్తం చేస్తూ నేడు ప్రధాని అధికార నివాస భవనాన్ని చుట్టిముట్టి దానికి నిప్పుపెట్టారు. దీంతో ఇక చేసేది లేక ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
నిరసనలకు ప్రధాన కారణం ఏమిటి?
సోషల్ మీడియా నిషేధం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజాస్వామ్యంపై ముప్పు నిరసనలకు దారితీశాయి.
ఓలీ రాజీనామా తర్వాత ఏమవుతుంది?
కొత్త నాయకత్వం ఎన్నిక చేయబడుతుంది మరియు దేశంలో శాంతి భద్రతల పునరుద్ధరణపై దృష్టి సారిస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: