Floods : దేశంలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy Rains) పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, రెండు తెలుగు రాష్ట్రాలు, ముంబయి, పంజాబ్ లలో కుండపోత వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. మరెందరో కూడు, గూడుకు దూరమై నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలతో నదులు, చెరువులు, గుంటలు నీటితో నిండిపోయాయి. లక్షలాది ఎకరాలు నీటిలో మునిగిపోయాయి. పలు గ్రామాలు నీటమునిగాయి. దీంతో ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది.

వరదలతో 43 మంది మృతి
పంజాబ్ రాష్ట్రం దశాబ్దాలలో అత్యంత వరద విపత్తును ఎదుర్కొంటోంది. ఊహించని ప్రకృతి విపత్తు ఎంతోమందిని బలిగొంది. ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు 43మంది మరణించారు. 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. 23 జిల్లాల్లోని 1902 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటి వరకు ఈ భారీ వరదలకు(Heavy Floods) 3,84,205 మంది ప్రజలు ప్రభావితం కాగా.. మరో 20.972 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు మరో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు అధిక వర్షాలు, వరదల వల్ల మొత్తం 43మంది మరణించారు.
కొండచరియలు విరిగి పడి పలువురు మృతి
ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలువురు మరణించారు. అనేకులు గాయపడ్డారు. వర్షాలతో క్లౌడ్ బరస్ట్ లతో కూడా అనేకులు గల్లంతు అయ్యారు. పలు గ్రామాల్లోని ప్రజలు మృత్యువాత పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎన్నడూ లేనంతగా అధిక వర్షాలతో, వరద నీటితో మునిగి పోయింది. దీంతో ఆరాష్ట్రం ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారింది. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
ఎంతమంది మరణించినట్టు అంచనా వేస్తున్నారు?
తాజా నివేదికల ప్రకారం, వరదల వల్ల 43 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఏయే ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి?
గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, కపూర్తలా, హోషియార్‌పూర్, తరణ్ తరణ్ వంటి 12 జిల్లాలలో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Read also :