Dogs-గత పదిరోజులుగా వీధి కుక్కలపై జరుగుతున్న చర్చపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది. దీంతో జంతు ప్రేమికులకు(Animal lovers) భారీ ఊరట లభించింది. వీధి కుక్కల నియంత్రణ విషయంలో దేశవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో తాను ఇచ్చిన వివాదాస్పద ఆదేశాలను సవరించిన సర్వోన్నత న్యాయస్థానం, వీధి కుక్కల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అవసరమైన టీకాలు ఇవ్వండి: సుప్రీంకోర్టు
వీధి కుక్కలను పట్టుకున్న తర్వాత వాటికి అవసరమైన టీకాలు, డీవార్మింగ్ చికిత్స అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం, వాటిని ఎక్కడ నుంచి పట్టుకున్నారో అదే ప్రాంతంలో తిరిగి విడిచిపెట్టాలని ఆదేశించింది. తద్వారా వాటి ఆవాసాలకు భంగం కలగకుండా చూడాలని సూచించింది.

అన్ని కుక్కలకు ఈ నిబంధన వర్తించదు
అయితే, ఈ నిబంధన అన్ని కుక్కలకు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. రేబిస్(Rabies) వ్యాధితో బాధపడుతున్న కుక్కలను, ప్రజలపై తీవ్ర దూకుడుగా ప్రవర్తించే కుక్కలను గుర్తించి వాటిని వేరు చేయాలని పేర్కొంది. ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలకు కూడా రోగనిరోధక టీకాలు వేయాలని, కానీ వాటిని జనావాసాల్లోకి తిరిగి వదలకకుండా ప్రత్యేక ఏర్పాటు చేసిన షెల్టర్లలోనే ఉంచి సంరక్షించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఈనెల 8వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొంత గందరగోళానికి దారితీయడంతో, తాజా సవరణలతో స్పష్టత నిచ్చింది.
తీర్పును పరిశీలించాలని కోరిన పలువురు సెలబ్రిటీలు
గతంలో సుప్రీంకోర్టు వీధుల్లో కుక్కలు లేకుండా చూడాలని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రాహుల్ గాంధీతో పాటు పలువురు సినీ, ఇతర ప్రముఖులు సుప్రీంకోర్టు తీర్పును మరోసారి పరిశీలించాలని కోర్టును వేడుకున్నారు. దీన్ని పరిశీలించిన కోర్టు తాజా సవరణలు చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్కలను పట్టుకునే బృందం పనిని అడ్డుకునే వారిపై రూ.25,000 జరిమానా, ఒక స్వచ్ఛంద సంస్థకు రూ. రెండు లక్షల జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది.
వీధి కుక్కలకు ఆహారం పెడితే ఏం జరుగుతుంది?
ప్రజా ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కుక్కలను పట్టుకునే బృందాన్ని అడ్డుకుంటే రూ.25,000 జరిమానా, ఒక స్వచ్ఛంద సంస్థపై రూ.2 లక్షల జరిమానా విధించవచ్చని పేర్కొంది.
పూర్వ తీర్పుతో పోల్చితే మార్పు ఏమిటి?
ముందు వీధుల్లో కుక్కలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వగా, తాజా సవరణలో కుక్కలను తగిన చికిత్సల తర్వాత తిరిగి వదిలే విధానం స్పష్టత పొందింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: