Dharmastala: తన మాజీ భర్త విజిల్ బ్లోయర్(Whistle blower) ముసుగు వ్యక్తి పచ్చి అబద్ధాలు చెబుతాడని అతని భార్య రత్నమ్మ పేర్కొంది. 1999లో తమకు పెళ్లయిందని, తాను సివిల్ వర్కర్ గా పనిచేశానని చెప్పారు.తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తర్వాత 2006లో విడిపోయామని రత్నమ్మ చెప్పారు. చిన్నయ్య అలియాస్ భీమా తనను తీవ్రంగా కొట్టేవాడని.. అందుకే విడిపోయానని ఆమె అన్నారు.విడాకుల సమయంలో కూడా అతను చాలా అబద్ధాలు చెప్పాడని, తనకు ఇవ్వాల్సిన భరణం ఎగ్గొట్టేందుకే అలా చేశాడని రత్నమ్మ వాపోయింది.

అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటే
చిన్నయ్య తనతో ఉన్నన్నాళ్లూ ఎప్పుడూ అత్యాచారాలు, సామూహిక ఖననాల గురించి చెప్పలేదని రత్నమ్మ అన్నారు. డబ్బు కోసమే ధర్మస్థల వివాదంలో తలదూర్చాడని చెప్పుకొచ్చారు. 2014లో చిన్నయ్య ధర్మస్థల నుంచి వెళ్లిపోయాడు. అతనికి మూడుసార్లు పెళ్లి అయిందని స్థానికులు చెబుతున్నారు. కానీ అందరి నుంచీ విడిపోయి, ప్రస్తుతం చిన్నయ్య ఒంటరిగానే ఉంటున్నాడని అన్నారు. చిక్కబల్లికి చెందిన బాలు అనే వ్యక్తి మాట్లాడుతూ చిన్నయ్య డబ్బు కోసం ఏమైనా చేస్తాడని ఆరోపించారు. 2014లో వెళ్లిపోయిన అతను తిరిగి మళ్లీ 2024లో ధర్మస్థలకు వచ్చాడు. గ్రామ పంచాయితీ చూపించిన ఖాళీ స్థలంలో షెడ్డు వేసుకున్నాడు. ఆ స్థలాన్ని తనపేరిట రాసి ఇవ్వాలని పంచాయితీ సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడని గ్రామ ప్రజలు సిట్ అధికారులకు తెలిపారు.
జాతీయ స్థాయిలో దూమారం రేపిన కేసు
తప్పుడు సమాచారంలో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడని ముసుగు వ్యక్తి భీమాను(Bhima) సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ధర్మస్థల వ్యవహారం జాతీయస్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వందలాదిమంది మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఆరోపణలు చేశారు. అందులో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నట్లు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన సిట్అధికారులు తవ్వకాలు ప్రారంబించారు. కానీ మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
భీమాను అరెస్టు చేసిన పోలీసులు
శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మహంతి భీమూను విచారించారు. అతడు మాయమాటలు చెప్పి వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని అంటున్నాడని సిట్ విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. శనివారం అతడిని కోర్టులో హాజరుపర్చారు. భీమా ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్త ఈ కేసు తీవ్రసంచలనంగా మారింది. భీమా ఏకంగా లాయర్ల సాయంతో కోర్టులో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పిస్తే, ఎక్కడెక్కడ పాతిపెట్టానో చెబుతానని చెప్పాడు. దీంతో పోలీసులు అతని ముఖం ఎవరికీ కనిపించకుండా ముసుగు తొడిగేవారు. చివరికి అతడు చెప్పినవన్నీ వట్టి ఫేక్ అని తేలడంతో దేశ ప్రజలు అవాక్కైపోతున్నారు. అబద్ధాన్ని ఇంత ధైర్యంగా ఎలా చెప్పగల్గాడు, వ్యవస్థలను తప్పుదోవ పట్టించే అధికారం ఇతనికి ఎవరిచ్చారని మండిపడుతున్నారు.
భీమా ఎందుకు వార్తల్లో నిలిచాడు?
ఆయన వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని, వాటిలో ఎక్కువగా హత్యలు మరియు అత్యాచారాలకు గురైన మహిళలవని సంచలన ఆరోపణలు చేశాడు.
SIT విచారణలో ఏమి తేలింది?
SIT అధికారులు తవ్వకాలు జరిపినా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. భీమా ఆరోపణలు వట్టి అబద్ధాలని తేలింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :