हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Crime News- ముగ్గురు కుటుంబసభ్యులను హతమార్చిన కుమారుడు.. ఎక్కడంటే?

Pooja
Telugu News: Crime News- ముగ్గురు కుటుంబసభ్యులను హతమార్చిన కుమారుడు.. ఎక్కడంటే?

Crime news: దేశ రాజధాని ఢిల్లీలో((Delhi) మైదాన్‌గఢీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ హత్యల వెనుక అదే కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు ఉండవచ్చనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అతను గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.

స్థానికుల కథనం మేరకు, ఓ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు బద్దలుచేసి లోపల ప్రవేశించగా, అందులోని దృశ్యం హృదయవిదారకంగా మారింది. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రేమ్ సింగ్ (వయస్సు సుమారు 50), ఆయన కుమారుడు హృతిక్ (24) రక్తపు మడుగుల్లో మృతదేహాలుగా కనిపించగా, మొదటి అంతస్తులో ప్రేమ్ సింగ్ భార్య రజనీ (సుమారు 45) కూడా చనిపోయినట్టుగా గుర్తించారు. ఆమె నోటికి గుడ్డ కట్టి ఉండటం హత్య పద్దతిపై అనేక ప్రశ్నలు తలెత్తిస్తోంది.

Crime News
Crime News

మానసిక సమస్యలతో కుమారుడే ఈ ఘాతుకానికి పాలుపడ్డారు

ఈ హత్యలు జరిగిన తర్వాత వారి చిన్న కుమారుడు సిద్ధార్థ్ (వయస్సు సుమారు 22) కనిపించకపోవడం, అతను గత 12 ఏళ్లుగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు అనే సమాచారం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. ఇంట్లో లభించిన మెడికల్ డాక్యుమెంట్లు, ప్రిస్క్రిప్షన్లు ఆధారంగా అతను ఓబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ (OCD), తీవ్రమైన కోపావేశం వంటి సమస్యలతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (IHBAS) లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడైంది. పోలీసుల అనుమానాల ప్రకారం, సిద్ధార్థ్ కుటుంబ సభ్యులను కత్తులతో పొడిచేలా, ఇటుకలు, రాళ్లతో కొడుతూ అత్యంత క్రూరంగా హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాక, ఒకరితో “తన కుటుంబాన్ని తానే హత్య చేశాడు, ఇక ఆ ఇంట్లో ఉండదని” చెప్పినట్టు తెలిసింది, ఇది విచారణలో కీలక ఆధారంగా మారనుంది.

ఇటీవల ప్రేమ్ సింగ్‌కు మద్యం తాగే అలవాటు ఉందని, తరచూ ఇంట్లో గొడవలు జరిగేవని గ్రామస్థాయి నాయకుడు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలాన్ని సీజ్ చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాల కోసం ఇంటినంతటినీ శోధిస్తున్నాయి. పరారీలో ఉన్న సిద్ధార్థ్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ MORE:

https://vaartha.com/telugu-news-teenmar-mallanna-says-she-is-forming-a-new-party-with-bcs/telangana/533518/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870