China Pak: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ లమధ్య ఉద్రికత్తలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు అమెరికా అన్నివిధాలుగా పాకస్తాన్కు మద్దతుగా అన్నివిధాలుగా చేస్తున్నది. ఇక చైనా కూడా పాకిస్తాన్ కు తనవంతు సాయాన్ని అందిస్తున్నది. అమెరికా, చైనా దేశాలు పాకిస్తాన్కు చేయూతనివ్వడంతో ప్రమాదంలో భారతదేశం పడినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అమెరికా పాకిస్తాన్ లో ఇంధన వనరుల అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక చైనా విషయానికి వస్తే పాకిస్తాన్ కు ఎప్పటి నుంచో అండగా నిల బడింది. గురువారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇస్లామాబాద్లో పాకిస్తాన్(Islamabad, Pakistan) అధ్యక్షుడు ఆసిఫ్ అలీజర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ల ను కలిశారు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు, కొత్తగా రవాణా, విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాల్లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నారు.

ఊపందుకుంటున్న పాక్ ఆర్థిక వ్యవస్థలో
గతంలో ప్రారంభమైన సిపిలిసి ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి ఊపందించాయి. భద్రతాపరమైన సవాళ్లు, ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని ప్రాజెక్టుల వేగం తగ్గింది. ప్రస్తుతం, రెండు దేశాలూ ఈ కారిడారు మరింత వేగవంతం చేసి, తమ లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నాయి. కొత్తగా ప్రారంభించనున్న ప్రాజెక్టుల్లో ముఖ్యంగా గ్వాదర్పో ర్ట్ అభివృద్ధి, రైల్వే నెట్వర్క్ ఆధునికీకరణ, ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడటంతో పాటు, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(China’s Belt and Road Initiative) (బి ఆర్ఎ)లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా చైనా, పశ్చిమ ప్రాంతంలో తన వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. అయితే, సిపిసి పాజెక్టుల విషయంలో భారత్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్, చైనా మధ్య నూతన ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుల ప్రారంభం భారత్కు అనేక సమస్యలను, ఆందోళనలను కలిగిస్తుంది.
భారత్ ను వెంటాడుతున్న భద్రతాపరమైన ఆందోళనలు
డిసిఆసి ప్రాజెక్టుల భద్రత కోసం చైనా తన సైనిక బలగాలను పాకిస్తాన్ లో మోహరించవచ్చనే ఆందోళన భారత్ కు ఉంది. చైనా తన ‘స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్‘ వ్యూహంలో భాగంగా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ పోర్ట్ ద్వారా చైనా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. సిపిఆసి వల్ల బలూచిస్తాన్లో స్థానిక నిరసనలు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అస్థిరత పెరగడం భారత్ కు కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. ఆపరేషన్ సిందూర్యు ద్ధానంతరం పాకిస్తాన్ భారతన్ను ఏవిధంగానైనా బలహీనపర్చేందుకు చైనా, అమెరికాలతో కొత్త స్నేహానికి బాటలు వేస్తున్నది. ఆయుధాలను సమకూర్చుకోవడం, దైప్వాక్షిక సంబంధాలను మెరుపరచుకోవడం వంటి కీలక అంశాల్లో పాకిస్తాన్ వేగంగా తన పావులను కదుపుతున్నది. ఇది భారత్ కు కొత్త తలనొప్పిగా పరిమించింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఏం మారింది?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్తాన్‌కు అమెరికా, చైనా మద్దతు ఇవ్వడం వల్ల భారత్ ఆందోళన చెందుతోంది.
చైనా పాకిస్తాన్‌తో ఏ ప్రాజెక్టులు చేపడుతోంది?
చైనా సిపిఎసి (CPEC) కింద రవాణా, విద్యుత్, మౌలిక వసతుల రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తోంది. ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి, రైల్వే నెట్వర్క్ ఆధునికీకరణ, ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: