BJP: బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిపై కసరత్తు జరుగుతూనే ఉంది. గతకొంత కాలంగా దీనిపై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. పలు కారణాలతో బీజేపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడుతూనే ఉంది. దీంతో ఎవరు తదుపరి అధ్యక్షుడు అనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందుగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హైకమాండ్ అగ్రనేతల మధ్య దీనిపై సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
కాగా వచ్చేనెల సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి(National President) ఎంపికపై బీజేపీ వేగం పెంచనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురి పేర్లను కూడా అగ్రనేతలు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈసారి జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు మహిళా నేతకు అప్పటించనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ రేసులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతరామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురందేశ్వరితోపాటు పలువురు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కొనసాగుతున్న జాతీయ సమీకరణాలు
బీజేపీ మహిళా నేతకే అవకాశం ఇస్తుందా? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ నూతన అధ్యక్షుడి కోసం కేవలం సామాజిక సమీకరణలు మాత్రమే కాకుండా పార్టీని బలోపేతం చేసే నాయకుడి కోసమే చూస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి బీజేపీ సంస్థాగత ఎన్నికలను మూడేళ్లకొసారి నిర్వహిస్తుంటారు. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2019 నుంచి ఆయన ఆ దవిలో ఉన్నారు. ఆయన రెండో టర్మ్ 2024 జూన్తో ముగిసింది. కొత్త అధ్యక్షుడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాలని కోరుతున్నారు. ఈ ఏడాది నవంబర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించే ముందు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది.
ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు?
ప్రస్తుతం జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :