కృత్రిమ మేధస్సు (AI) టెక్ రంగాన్ని వేగంగా మార్చుతోంది. (Tech Company)ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. అయినా ఇంకా 2025లో టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. స్వతంత్ర లేఆఫ్స్ ట్రాకర్ (Layoffs.fyi) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 551 టెక్ కంపెనీల నుంచి సుమారు 1,22,549 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. ఈ తొలగింపులకు ప్రధాన కారణాల్లో ఒకటి కంపెనీలకు పెరుగుతున్న ఖర్చులు. ద్రవ్యోల్బణం, సుంకాలు, ఆపరేటింగ్ ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి.
Read Also: PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ

AI ప్రభావంతో టెక్ దిగ్గజాల్లో భారీ లేఆఫ్స్
ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీల జాబితాలో అమెజాన్ ముందు వరసలో ఉంది ఉంది. (Tech Company) ఈ-కామర్స్ దిగ్గజం అక్టోబర్‌లో తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌ను ప్రకటించింది. దాదాపు 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గిస్తూ AIతో సహా ఇతర రంగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఇక మైక్రోసాఫ్ట్ కూడా 2025 నాటికి మొత్తం 15 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. జూలైలో జరిగిన పునర్నిర్మాణంలోనే సుమారు 9 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. AI ఆధారిత ఉత్పత్తులు, సేవలపై దృష్టి పెంచడమే ఇందుకు ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది.
HP, ఆపిల్, మెటా, గూగుల్, వెరిజోన్, సీమెన్స్ వంటి సంస్థలు కూడా వందల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ లేఆఫ్స్ అన్నింటిలోనూ AI ఆధారిత పునర్వ్యవస్థీకరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా AI టెక్నాలజీ టెక్ రంగాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత విషయంలో పెద్ద సవాళ్లను తీసుకొస్తోంది.భవిష్యత్తులో ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, AIతో కలిసి పనిచేసే విధంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: