భారత ప్రభుత్వం ఇటీవల సెమీకండక్టర్ (Semiconductor) తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ భారతీయ జనతా పార్టీ (BJP) కి దేశంలోనే అత్యధిక రాజకీయ విరాళం అందించింది. బీజేపీతోపాటు కాంగ్రెస్, ఇతర పార్టీలకు కూడా విరాళాలు అందించింది. ఈ పరిణామం వ్యాపార వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
Read Also: Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశంలో ఏర్పాటు కాబోతున్న మూడు సెమీ కండక్టర్ యూనిట్లలో రెండింటిని టాటా గ్రూప్ (TATA Group) ఏర్పాటు చేయబోతోంది.2024 ఫిబ్రవరి 29న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశంలో మూడు సెమీకండక్టర్ యూనిట్లకు ఆమోదం లభించింది.అయితే వీటిలో రెండు యూనిట్లు టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి.
ఒకటి గుజరాత్‌లోని ధోలేరాలో తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్ భాగస్వామ్యంతో ‘ఫ్యాబ్’ యూనిట్. మరొకటి అస్సాంలోని మోరిగావ్‌లో చిప్‌ల అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్.సెమీకండక్టర్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ పథకంలో భాగంగా.. ఈ యూనిట్ల నిర్మాణ వ్యయంలో 50% వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించనుంది.
ఈ యూనిట్లలో టాటా గ్రూప్
టాటా గ్రూప్ (TATA Group) యొక్క రెండు యూనిట్లకు కేంద్రం నుండి లభించే సబ్సిడీ మొత్తం దాదాపు రూ.44,203 కోట్లు. ఈ యూనిట్లలో టాటా గ్రూప్ మొత్తం రూ.1.18 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుందని, దీని ద్వారా దాదాపు 46,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం తెలిపింది.

2024 ఏప్రిల్ 2న టాటా గ్రూప్‌కు చెందిన 15 కంపెనీలు.. మొత్తం రూ.915 కోట్ల రాజకీయ విరాళాలను తమ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వివిధ పార్టీలకు అందించాయి. ఈ విరాళాల్లో అత్యధిక మొత్తం.. అంటే రూ.758 కోట్లు.. భారతీయ జనతా పార్టీ (BJP)కి అందాయి. BJP తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.77.3 కోట్లు అందుకుంది. మిగిలిన మొత్తం ఎనిమిది ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు అందించారు.
వ్యూహాత్మక చర్య
సాధారణంగా వ్యాపారాలకు , అభివృద్ధి ప్రణాళికలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలకు.. కంపెనీలు నిధులను కేటాయించడం, అభివృద్ధికి మద్దతు ఇవ్వడం అనేది ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, వ్యాపార వ్యవస్థల్లో సాధారణంగా కనిపించే ఒక వ్యూహాత్మక చర్య అని స్క్రోల్(scroll.in) తన కథనంలో పేర్కొంది. అయితే ఈ పరిణామం కేవలం టాటా గ్రూప్‌కే పరిమితం కాలేదు.
సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు పొందిన మరో సంస్థ మురుగప్ప గ్రూప్ కూడా తమ యూనిట్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన కొద్ది వారాల్లోనే BJPకి రూ.125 కోట్లు విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వ విధానాల ద్వారా లబ్ధి పొందిన లేదా కొత్త రంగాలలోకి ప్రవేశించే కార్పొరేషన్లు.. తమ భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలకు అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఇలా చేస్తుంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: