हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Tamilnadu: వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

Pooja
Telugu News: Tamilnadu: వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

తమిళనాడులోని(Tamilnadu) కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో మళ్లీ విషాదం చోటుచేసుకుంది. అయ్యర్పాడి తేయాకు తోటలో చిరుతపులి దాడికి గురైన ఐదేళ్ల సైఫుల్ అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అస్సాం‌కు చెందిన వలస కార్మికుడి కుమారుడైన సైఫుల్ శనివారం ఇంటిముందు ఆడుకుంటుండగా, పొదల్లో దాగి ఉన్న చిరుత అతడిపై దాడి చేసి తోట లోపలికి లాగుకుంది. వెంటనే గాలింపు ప్రారంభించిన కార్మికులు, అటవీ సిబ్బంది కొద్దిసేపటి తర్వాత బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు.

Read Also: Goa: గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గత ఎనిమిది నెలల్లో ఇదే ప్రాంతంలో ఇలాంటి దాడుల్లో ఇది మూడో చిన్నారి మృతి కావడం భయం మరింత పెంచింది. ఆగస్టులో(Tamilnadu) నూర్జిల్ హక్ (8), జూన్‌లో రోషిణి (4) చిరుత దాడిలో మరణించిన ఘటనలు ఇంకా మిగిలే ఉన్నాయి. తేయాకు తోటల పక్కనే ఉన్న ఎస్టేట్ కాలనీలకు సరైన ఫెన్సింగ్, లైటింగ్ లేకపోవడం సమస్యను మరింత తీవ్రమం చేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అదనపు కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పహారాను పెంచారు. సాయంత్రం తర్వాత పిల్లలను బయటకు అనుమతించవద్దని, ఎక్కడైనా చిరుత సంచారం కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. వన్యప్రాణి దాడులను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870