తమిళనాడు (TamilNadu Crime) రాష్ట్రం కడలూరు జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వృద్ధుడిపై అతడి కోడలు ప్రియుడు పెట్రోల్ పోసి తగలబెట్టారు. జిల్లాలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్ (70) తన కోడలు జయప్రియా, మణికందన్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని తెలిసి తీరు మార్చుకోవాలని వారిద్దరినీ హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాజేంద్రన్ హత్యకు కుట్ర పన్నారు. శుక్రవారం రాజేంద్రన్ బైక్ పై వెళ్తుండగా, కారులో తన స్నేహితులతో వచ్చిన మణికందన్ అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో సాయం కోసం అతను రోడ్డుపై పరిగెత్తిన వీడియో వైరల్ గా మారింది.
Read Also: TG Crime: కెనాల్‌లో పడి బాలుడు మృతి?

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: