తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెల్ ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పదిహేడేళ్ల యువకుడు శక్తిశ్వరన్ (Shaktiswaran) యూట్యూబ్ వీడియోలు చూసి స్వయంగా ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గే ప్రయత్నంలో అకాల మరణానికి గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

కఠినమైన ఆహార నియమాలు.. నీరు, పళ్లరసాలు మాత్రమే
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ గత మూడు నెలలుగా యూట్యూబ్‌లో డైట్ వీడియోలు (Diet videos on YouTube) చూసి కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నాడు. అతను నిత్యం సాధారణ ఆహారాన్ని మానేసి కేవలం నీరు, పళ్ల రసాలు మాత్రమే తీసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అని కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్య సలహా లేకుండానే డైట్ ప్రారంభం
శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు. బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నాడని చెప్పారు. ఇవన్నీ కలిపి ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయని ఆరోపిస్తున్నారు.
ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో మృతి
గురువారం నాడు శక్తిశ్వరన్ ఊపిరాడక ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన అప్పటికే మరణించాడని ప్రకటించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Lok Sabha: అఖిలపక్ష భేటీతో ఆందోళనలకు బ్రేక్