हिन्दी | Epaper

Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

Saritha
Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. రాష్ట్రాల ఆదాయ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచితాల పంపిణీ కొనసాగుతోందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ (CJI Justice Suryakant) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల స్థానంలో రాష్ట్రాలు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.

Read Also: Sundar Pichai on Vizag: ప్రపంచానికి గేట్ వేగా విశాఖపట్నం

ఈ పథకాలకు డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు?

Tamil Nadu: ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
Tamil Nadu: Supreme Court expresses extreme impatience over announcement of free schemes in elections

ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు, ఉచిత విద్యుత్ పథకాలపై విచారణ చేస్తూ రాష్ట్రాలను తీవ్రంగా విమర్శించింది సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయమల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పాంచోలి ధర్మాసనం. “ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. రాష్ట్రాలు ఆదాయ లోటుతో కష్టపడుతున్నప్పటికీ ఉచితాలు కొనసాగిస్తున్నాయి. ఈ పథకాలకు డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు? పన్ను చెల్లింపుదారులే కదా? ఇంకెవరూ కాదు కదా?” అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉచితాల స్థానంలో రాష్ట్రాలు ఉపాధి కల్పన, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని సూచించింది.

తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడాన్ని ప్రత్యేకంగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. “ఇలాంటి ఆకస్మిక ప్రకటనలు పవర్ డిస్కామ్‌లను ఇబ్బంది పెడతాయి. టారిఫ్‌లు, బడ్జెట్ లెక్కలు సరి చేయడం కష్టమవుతుంది. ముందుగా ప్రకటించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు” అని ధర్మాసనం అంది. ఇలాంటి ఉచితాలు దేశ ఆర్థిక అభివృద్ధిని ఆపేస్తాయని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870