తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గవర్నర్–ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగించకుండా పదవిని అవమానించారని, గతంలో ఏ గవర్నర్ ఇలా ప్రవర్తించలేదని స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చదవకుండా,
Read Also: Climate Change: గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం

దేశభక్తిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు
జాతీయ గీతాన్ని ప్లే చేయాలని పట్టుబట్టారని, ప్రసంగం ముగింపులో ప్లే చేస్తామని చెప్పినా వినకుండా సభ మధ్యలో వెళ్లిపోయారని స్టాలిన్ పేర్కొన్నారు. దేశభక్తిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.తన స్థానాన్ని గౌరవించని వారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇటీవల జరిగిన తమిళనాడు (Tamil Nadu) తొలి శాసనసభ సమావేశంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై గవర్నర్ స్పందిస్తూ.. తమిళ తల్లి ప్రార్థనా గీతం పూర్తైన వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించకుండా వదిలేశారని, ప్రసంగ సమయంలో పలుమార్లు మైక్ కట్ చేసి తనను అవమానించారని ఆరోపించారు. ఈ కారణంగానే సభ నుంచి బయటకు వచ్చానని వివరణ ఇచ్చారు. కాగా శాసనసభ సమావేశాల నుంచి గవర్నర్ ఆర్.ఎన్.రవి మధ్యలో వెళ్లిపోవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.రాష్ట్ర ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత తాజా పరిణామాలతో మరింత తీవ్రతరమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: