తమిళనాడు (Tamil Nadu) లో అధికారమే లక్ష్యంగా BJP పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తన తాజా తమిళనాడు పర్యటనలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పోటీ చేయడం మాత్రమే కాకుండా.. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కమలం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు.. పాత మిత్రపక్షం ఏఐఏడీఎంకేకు చెక్ పెడుతూ.. కొత్త శక్తులతో కూటమి కట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
Read also: Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన
టీవీకే ఒక ప్రత్యామ్నాయ శక్తి
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తమిళనాడు రాజకీయాల్లో ఎదుగుతుండటంతో.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది.

ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని.. డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్ర పక్షాలకు పంపించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: