2008 ముంబై ఉగ్రదాడుల్లో కీలకంగా ముద్ర వేసిన తహవ్వుర్ హుస్సేన్ రాణా (64)ను ఎట్టకేలకు భారత్‌కు అప్పగించారు దాదాపు 20 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రాణా భారత్‌కు రావడం గొప్ప విజయం. అమెరికా నుంచి గురువారం ప్రత్యేక విమానంలో రాణా ఢిల్లీ చేరాడు తహవ్వుర్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో వైద్యాధికారిగా పనిచేశాడు. తర్వాత కెనడాలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌గా స్థిరపడ్డాడు బాల్యమిత్రుడు డేవిడ్ హెడ్లీకి సహకరించి ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి.2008 నవంబర్‌లో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు వీటికి లష్కరే తోయిబా, హుజీ ఉగ్రవాద సంస్థలు బాధ్యత వహించాయి. రాణా వీటి తో కుమ్మక్కై కుట్రకు తోడ్పడ్డాడు దాడుల అనంతరం, “ఇది భారతీయులకు జరగాల్సిందే” అని రాణా హెడ్లీకి అన్నాడట.

దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ పురస్కారం ఇవ్వాలంటూ సైతం ప్రశంసల వర్షం కురిపించాడని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.డేవిడ్ హెడ్లీ ఇప్పటికే అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు అతనికి పూర్తి స్థాయిలో సహకరించిన రాణా విచారణ కీలకంగా మారింది. ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. రాణాను ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా, 18 రోజుల కస్టడీ మంజూరైంది.హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా స్పందిస్తూ… రాణా అప్పగింత 26/11 బాధితులకు న్యాయం కలగజేసే తొలి అడుగుగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ మాజీ రాయబారి మార్క్ సోఫర్ భారత్ ప్రయత్నాలను ప్రశంసించారు. ఎన్ఐఏ భావిస్తున్నది ఏంటంటే… రాణా నోటి నుంచి అసలైన కుట్ర కారులు ఎవరన్నదీ బయటపడే అవకాశం ఉంది 26/11 వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠాలను ఈ విచారణ ద్వారా వెలికితీయవచ్చని నమ్మకంగా ఉన్నారు.