73 ఏళ్ల వయసులో స్వరాజ్ కౌశల్, సీనియర్ న్యాయవాది, (Swaraj Kaushal) మిజోరం మాజీ గవర్నర్ మరియు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, ఈరోజు కన్నుమూశారు. ఈ సంఘటనపై వారి కుమార్తె, ఢిల్లీ(Delhi) బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సోషల్ మీడియా ద్వారా భావోద్వేగ నివాళి అర్పించారు.
బన్సూరి తన పోస్టులో ఇలా పేర్కొన్నారు:
“నాన్నా స్వరాజ్ కౌశల్ జీ, మీ ఆప్యాయత, క్రమశిక్షణ, దేశభక్తి, అపారమైన సహనం నా జీవితానికి ఎప్పటికీ వెలుగునిస్తాయి. మీ నిష్క్రమణ తీవ్ర వేదనను మిగిల్చినా, మీరు ఇప్పుడు అమ్మతో కలిసి భగవంతుని సన్నిధిలో శాశ్వత శాంతితో ఉంటారనే నమ్మకం నాకుంది. మీ కుమార్తెగా పుట్టడం నా జీవితంలో గొప్ప గర్వకారణం.”
Read aslo: పైరసీకి హీరోలేంటి? నిర్మాత సంచలన వ్యాఖ్యలు

జీవిత ప్రయాణం, అంత్యక్రియలు, సంతాపం
స్వరాజ్ కౌశల్(Swaraj Kaushal) 1952 జులై 12న సోలన్లో జన్మించారు. ప్రముఖ క్రిమినల్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఆయన 1990–1993 మిజోరం గవర్నర్ గా పనిచేశారు, 1998–2004 హర్యానా వికాస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలందించారు 1975లో సుష్మా స్వరాజ్తో వివాహం చేసుకున్నారు వారి ఏకైక సంతానం బన్సూరి స్వరాజ్. న్యాయవాదిగా తన కెరీర్‌లో స్వరాజ్ కౌశల్ ఎన్నో కీలక కేసులు వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో బరోడా డైనమైట్ కేసులో సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండెజ్ తరఫున వాదించి గుర్తింపు పొందారు. ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై నిపుణుడిగా ఆయనకు మంచి పేరుంది. 1986లో మిజోరం శాంతి ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించి, 20 ఏళ్ల తిరుగుబాటుకు ముగింపు పలికారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కౌశల్ మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: