Sushila Karki: జెన్-జీ (జడ్) యువత చేపట్టిన ఆందోళనల కారణంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలిన కొన్ని రోజుల తర్వాత, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి(Chief Minister) సుశీల కర్కి ప్రధాని బాధ్యతలను స్వీకరించారు. ఆమె స్పష్టం చేసినట్లుగా, తమ ప్రభుత్వం కేవలం ఆరు నెలలపాటు మాత్రమే అధికారంలో ఉంటుంది. సుశీల కర్కి మరియు ఆమె బృందం అధికారాన్ని రుచి చూడటానికి కాకుండా, ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వం రూపొందించబడిందని చెప్పారు.

అమరవీరులు గుర్తింపు, నిరసనలు మరియు దేశ పునర్నిర్మాణం
సుశీల కర్కి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా ‘అమరవీరులు’గా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, నిరసనల సమయంలో జరిగిన విధ్వంసకర ఘటనలపై సవివర విచారణ జరిపుతామని స్పష్టం చేశారు. దేశ పునర్నిర్మాణం కోసం ప్రజల సహకారం అవసరం అని, వారి మద్దతు లేకుండా సక్సెస్ సాధించలేమని కర్కి తెలిపారు.
అధికారం కోసం కాకుండా దేశానికి సేవ
సుశీల కర్కి, తమ పాలనలో ప్రధానంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని, ఆరు నెలలకు మించి అధికారంలో కొనసాగరాదు అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ(Nepal politics) వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ప్రజల కష్టాలను తగ్గించి, కొత్తగా ఎన్నికయ్యే పార్లమెంటుకు పూర్తి బాధ్యతలు అప్పగించడమే తమ ప్రథమ ఫోకస్ అని ఆమె పేర్కొన్నారు.
సుశీల కర్కి ప్రభుత్వం ఎంతకాలం అధికారంలో ఉంటుంది?
ఆరు నెలలపాటు మాత్రమే.
ఆమె ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఏమిటి?
ప్రజలకు సేవ చేయడం, దేశ పునర్నిర్మాణానికి దోహదం చేయడం.
Read hindi News: Hindi.vaartha.com
Read also: