हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Sushant Singh Rajput: సుశాంత్ ని చంపేశారు: సోదరి శ్వేత

Aanusha
Latest News: Sushant Singh Rajput: సుశాంత్ ని చంపేశారు: సోదరి శ్వేత

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మరణించి నాలుగేళ్లు గడిచినా, ఆ కేసు చుట్టూ ఉన్న అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. 2020 జూన్‌లో ముంబైలోని ఆయన ఫ్లాట్‌లో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.తాజాగా ఆయన సోదరి శ్వేత సింగ్ కీర్తి (Shweta Singh Keerti) చేసిన సంచలన ఆరోపణలు ఈ కేసును మరోసారి వార్తల్లోకి తెచ్చాయి.

Read Also: Abishan Jeevinth: పెళ్లి చేసుకున్న సినీ ద‌ర్శ‌కుడు

తన సోదరుడు ఆత్మహత్య చేసుకోలేదని, అతడిని దారుణంగా హత్య చేశారని ఆమె ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.”సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు, అతడిని చంపేశారు” అని శ్వేత సింగ్ స్పష్టం చేశారు. తాను సంఘటనా స్థలాన్ని పరిశీలించానని, సుశాంత్ మంచానికి, ఫ్యాన్‌కు మధ్య ఉన్న దూరం చూస్తే అతను ఉరి వేసుకునే అవకాశమే లేదని ఆమె అన్నారు.

అంతేకాకుండా, సుశాంత్ మెడపై ఉరితాడు గుర్తు కాకుండా, కేవలం ఒక చిన్న చైన్ ముద్ర మాత్రమే ఉందని, ఇది ఎన్నో అనుమానాలకు తావిస్తోందని వివరించారు.సుశాంత్ మరణం తర్వాత తాను అమెరికాలో ఒక మానసిక నిపుణుడిని, ముంబైలో మరొకరిని సంప్రదించానని శ్వేత వెల్లడించారు.

 Sushant Singh Rajput
 Sushant Singh Rajput

ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని

ఒకరికొకరు సంబంధం లేని ఆ ఇద్దరూ కూడా ఇది హత్యేనని, ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పడం తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. తన తమ్ముడి కెరీర్ వేగంగా ఎదుగుతున్న సమయంలో కొందరు అసూయతో చేతబడి చేయించారని,

2020 మార్చి తర్వాత సుశాంత్ (Sushant Singh Rajput) బతకడంటూ తమకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు.ఇక సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) ప్రవర్తనపై కూడా శ్వేత అనుమానాలు వ్యక్తం చేశారు. “నువ్వు చాలా వేగంగా ఎగురుతున్నావ్, నీ రెక్కలు కత్తిరించాలి” అన్న అర్థం వచ్చేలా రియా ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా,

దానికి సుశాంత్ లైక్ చేయడం తనకు వింతగా అనిపించిందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో దర్యాప్తు సంస్థలు ఇది ఆత్మహత్య అని తేల్చినప్పటికీ, శ్వేత సింగ్ చేసిన ఈ తాజా ఆరోపణలతో సుశాంత్ కేసుపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870