ఉన్నత విద్యా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. UGC 2026 ‘ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహక నియమావళి – 2026’ నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు 2012లో రూపొందించిన పాత నిబంధనలే అమల్లో కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసులు జారీ చేసి, వారి వివరణ కోరింది.
Read Also: Budget 2026: పాత పన్ను vs కొత్త పన్ను విధానంలో ఏది బెస్ట్?
నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి
ఈ విషయంపై మృత్యుంజయ్ తివారి, అడ్వొకేట్ వినీత్ జిందాల్, రాహుల్ దేవన్ అనే వ్యక్తులు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మాల్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రముఖ న్యాయవాదులతో కూడిన ఒక కమిటీ.. ఈ నిబంధనలను పునఃపరిశీలించాలని సూచించింది. ఈ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగానికి ఆస్కారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

కొత్త నిబంధనల ప్రకారం ‘కుల ఆధారిత వివక్ష’ అనే పదాన్ని కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకే పరిమితం చేశారని పిటిషనర్లు ఆరోపించారు. దీనివల్ల జనరల్ కేటగిరీకి చెందిన వారికి ఎలాంటి వివక్ష ఎదురైనా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(1), 21లను ఉల్లంఘించడమేనని వాదించారు. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ‘సంపూర్ణ న్యాయం’ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ నిబంధనలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: