हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News telugu: Supreme Court:బిచ్చగాళ్ల నివాస హక్కుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Sharanya
News telugu: Supreme Court:బిచ్చగాళ్ల నివాస హక్కుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా ఉన్న యాచకుల వసతిగృహాలు (Beggar Homes) ఇకపై జైళ్ల్లా ఉండకూడదని, అవి గౌరవప్రదమైన పునరావాస కేంద్రాలుగా మారాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నివాసితుల ప్రాథమిక హక్కులను హానికరంగా మార్చే విధంగా ఈ హోంలు ఉండరాదని, అలాంటప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.

లంపూర్ బెగ్గర్ హోం ఘటనపై చారిత్రాత్మక తీర్పు

ఢిల్లీ(Delhi)లోని లంపూర్ బెగ్గర్ హోమ్‌లో కలుషిత నీటి వల్ల నివాసితులు మరణించిన ఘటనపై విచారణ చేస్తూ జస్టిస్ జె.బి. పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.”బెగ్గర్ హోంలు శిక్షించే ప్రదేశాలు కాకుండా, జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసే పునరావాస కేంద్రాలుగా మారాలి” – ధర్మాసనం వ్యాఖ్య.

‘హోమ్’ అనే పదానికి అర్థం గౌరవం, సంరక్షణ

ధర్మాసనం అభిప్రాయపడింది: “హోమ్ అనే పదానికి సురక్షితమైన వాతావరణం, గౌరవం మరియు సంరక్షణ అనే భావన ఉంది. ఇది శిక్షకు ప్రతీకంగా ఉండకూడదు.” అధిక జనాభా, వైద్య సదుపాయాల లోపం, పరిశుభ్రతలేని వాతావరణం ఆర్టికల్ 21 ప్రకారం జీవిత హక్కును కాలరాస్తాయని కోర్టు హెచ్చరించింది.

పేదరికాన్ని నేరంగా చూడకండి

కోర్టు తన వ్యాఖ్యల్లో, బ్రిటిష్ యుగం నాటి వలసవాద ధోరణిలో రూపొందిన పాత చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయని, వాటిని విడిచిపెట్టి సామాజిక న్యాయం అందించే కొత్త దృక్పథంతో వ్యవస్థలు నడవాలని సూచించింది.

సుప్రీంకోర్టు జారీ చేసిన కీలక మార్గదర్శకాలు

వైద్య సదుపాయాలు

  • హోమ్‌లో చేరిన ప్రతి నివాసికి 24 గంటల్లో వైద్య పరీక్షలు తప్పనిసరి.
  • ప్రతినెలా ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలి.
  • శుద్ధమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, కీటకాల నివారణ తప్పనిసరి.

ఆహారం & వసతి

  • పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో నాణ్యమైన భోజనం అందించాలి.
  • అధిక జనాభాతో భయపెడతకూడదు, గాలి-వెలుతురు కలిగిన వసతి అవసరం.

పునరావాసం & చట్టబద్ధమైన హక్కులు

  • నివాసితులకు జీవనోపాధి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
  • వారికి అర్థమయ్యే భాషలో చట్టసంబంధ అవగాహన కల్పించాలి.
  • మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకమైన భద్రత కలిగిన వసతులు కల్పించాలి.

బాధ్యత & జవాబుదారీతనం

  • పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలను నియమించాలి.
  • నిర్లక్ష్యం వల్ల మరణాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకొని, కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.
  • పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలను నియమించాలి.
  • నిర్లక్ష్యం వల్ల మరణాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకొని, కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/betting-case-ed-issues-notices-to-urvashi-mimi-chakraborty-in-online-betting-app-promotion-case/crime/547245/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870