ఖైదీల ఓటు హక్కుపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకారం
దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న సుమారు 4.5 లక్షల విచారణ ఖైదీలకు ఓటు హక్కు నిరాకరణపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్(supreme court) మరియు జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి (ECI) నోటీసులు జారీ చేసింది.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 62(5) కింద ఖైదీలకు విధించిన ఓటు నిషేధం రాజ్యాంగ హామీలకు విరుద్ధమని వాదించారు. రాజ్యాంగం ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని, ఈ హక్కును కేవలం చట్టబద్ధమైన కారణాలతోనే పరిమితం చేయాలని సూచించారు.
Read also: లాభాలతో ముగిసిన మార్కెట్లు..

“నేరం నిరూపితం కాకుండా హక్కు నిరాకరణ ఎందుకు?” – పిటిషన్‌లో ప్రశ్న
పిటిషన్‌లో పేర్కొన్నట్లు, దేశంలోని జైళ్లలో(supreme court) ఉన్న ఖైదీలలో 75 శాతానికి పైగా విచారణ ఖైదీలే ఉన్నారు. వారిలో 80–90 శాతం మంది చివరికి నిర్దోషులుగా విడుదలవుతారని, అయినప్పటికీ వారు సంవత్సరాల పాటు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. “జైల్లో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయగలిగితే, ఇంకా నేరం నిరూపితం కాని పౌరులకు ఓటు హక్కు ఎందుకు ఇవ్వడం లేదు?” అని పిటిషనర్లు ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా 1,350 జైళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కు సులభంగా కల్పించవచ్చని సూచించారు. పాకిస్థాన్ వంటి దేశాల్లో సైతం విచారణ ఖైదీలకు ఓటు హక్కు ఉన్నదని, భారత్‌లో మాత్రం పూర్తి నిషేధం విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: