అహ్మదాబాద్‌లో 260 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో పైలట్-ఇన్-కమాండ్‌ను నిందించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లకు నోటీసులు జారీ చేసింది.
Read Also: Gujarat: ప్రియుడిపై కసితో బాంబుల బెదిరింపు కాల్స్

పిటిషన్, ఏఏఐబీ ప్రాథమిక నివేదిక
ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానానికి పైలట్-ఇన్-కమాండ్‌గా పనిచేసిన సుమీత్ సబర్వాల్ ఈ ప్రమాదంలో మరణించారు. ఆయన తండ్రి పుష్కరాజ్ సబర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) ఈ ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ఈ ఏడాది జులైలో విడుదల చేసిన ప్రాథమిక నివేదికను వారు తమ పిటిషన్‌లో సవాల్ చేశారు.
ఏఏఐబీ నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి వేగంగా “కటాఫ్” పొజిషన్‌లోకి వెళ్లాయని పేర్కొంది. సుమారు 10 సెకన్ల తర్వాత స్విచ్‌లను తిరిగి ఆన్ చేసినప్పటికీ, ఇంజిన్లు ఆగిపోయి (ఫ్లేమ్డ్ అవుట్) విమానం కుప్పకూలిందని నివేదికలో వివరించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు
ఏఏఐబీ ప్రాథమిక నివేదికతో విభేదిస్తూ పైలట్ తండ్రి మరియు పైలట్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు,(Supreme Court) పైలట్‌ను నిందించలేమని వ్యాఖ్యానిస్తూ కేంద్రం, డీజీసీఏల నుంచి వివరణ కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: