మైనర్లు (Minors) విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న వివిధ సోషల్ మీడియా(Social media) యాప్‌లకు అలవాటు పడటం, ముఖ్యంగా అనుచిత ఆన్‌లైన్ కంటెంట్‌ను యాక్సెస్ చేస్తుండటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లకు అశ్లీల ఆన్‌లైన్ కంటెంట్‌ను చూడకుండా అడ్డుకునేందుకు ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ సిస్టంను ప్రవేశపెట్టాలని అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) సూచించింది.
Read Also: IBomma: రవి పక్కా ప్రణాళిక, నకిలీ గుర్తింపులతో దందా

సోషల్ మీడియా ప్రభావం, సుప్రీంకోర్టు ఆందోళన
సోషల్ మీడియాకు చిన్న వయస్సులోనే బానిసలుగా మారడం ద్వారా మైనర్లు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా చెడు పనులకు కూడా ప్రభావితమవుతున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సరైన డాక్యుమెంట్లు పరిశీలించకుండానే, లేదా వయస్సును తప్పుగా ఎంటర్ చేసి మైనర్లు ఎంట్రీ అవుతుండటంతో, వారు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో అశ్లీల కంటెంట్‌ను కూడా సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు.
- ధర్మాసనం: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయ్‌మల్య గుర్చి నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై నొక్కి చెప్పింది.
- నియంత్రణ: మైనర్లు ఆశ్లీల ఆన్‌లైన్ కంటెంట్‌ను వినియోగించకుండా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఆధార్ ధృవీకరణ, నియంత్రణ సంస్థ అవసరం
ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మైనర్ల వయస్సును ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ (Aadhaar Based Age Verification) వ్యవస్థను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టంగా సూచించింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి, ప్రాథమిక హక్కులను సమతుల్యం చేయడానికి బలమైన ఒక నియంత్రణ సంస్థ అవసరం అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ముఖ్యంగా, వికలాంగులను కించపరిచే ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎదుర్కోవడానికి మరియు మైనర్ల భద్రతకు కఠినమైన చట్టాలు అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హాస్యనటులు, పాడ్‌కాస్టర్లు దాఖలు చేసిన ఒక కేసు విచారణ సందర్భంగా వెలువడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: