ఉద్యోగుల పనిభారం తగ్గించి, పని అనంతరం వ్యక్తిగత సమయాన్ని కాపాడే దిశగా లోక్‌సభలో ఒక కీలకమైన ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబడింది. పని సమయం ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో వచ్చే ఆఫీస్ కాల్స్ లేదా ఇమెయిల్స్‌కు స్పందించకపోయినా ఉద్యోగులు బాధ్యత వహించనవసరం లేకుండా చట్టపరమైన హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బిల్లు సిద్ధమైంది.
Read Also: Visakhapatnam Port: విశాఖ పోర్టు రికార్డు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే(SuppriyaSule) శుక్రవారం లోక్‌సభలో రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025’ను ప్రవేశపెట్టారు. ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు ప్రత్యేకంగా ఉద్యోగుల సంక్షేమ అథారిటీ’ని ఏర్పాటు చేయాలని బిల్లు సూచిస్తోంది. డిజిటల్ ఆధారిత వర్క్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించడం, మెరుగైన work-life balance అందించడం ఈ బిల్లుకి ప్రధాన లక్ష్యం అని ఆమె తెలిపారు.
ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) ఉద్యోగుల(SuppriyaSule) సంక్షేమంపై దృష్టి పెట్టిన మరో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. భారతదేశంలో 51% మంది ఉద్యోగులు ప్రతీవారం 49 గంటలకు పైగా పనిచేస్తున్నారని, దాదాపు 78% మంది భారీ పని ఒత్తిడితో బాధపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటల పరిమితి, మానసిక ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన బిల్లులో పేర్కొన్నారు.
అయితే ఇవి ప్రైవేట్ మెంబర్ బిల్లులు కావడంతో, ఇవి చట్టంగా మారే అవకాశం సాధారణంగా చాలా తగ్గిందే. ప్రభుత్వం స్పందించిన తర్వాత చాలా బిల్లులు ఉపసంహరించబడటం ఆనవాయితీ.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: