దేశంలో ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరు, ఇటీవల కాలంలో రోడ్ల దుస్థితి, భయంకరమైన ట్రాఫిక్ సమస్యలపై విమర్శలు, అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు ఇప్పటికే ఈ సమస్యలపై గళం విప్పారు. తాజాగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా కూడా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై, ట్రాఫిక్ (Bengaluru Traffic) సమస్యలపై చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
Read Also: Nitish Kumar oath : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం..
బెంగళూరు రోడ్లపై వెళ్లడం కంటే కూడా అంతరిక్షంలో ప్రయాణించడమే తేలిక
శుభాన్షు శుక్లా బెంగళూరు ట్రాఫిక్ సమస్యల (Bengaluru Traffic) గురించి వ్యంగ్యంగా స్పందించారు. బెంగళూరు రోడ్లపై వెళ్లడం కంటే కూడా అంతరిక్షంలో ప్రయాణించడమే తేలిక అని చెప్పారు. అయితే ఇటీవలే బెంగళూరులో జరిగిన బెంగళూరు టెక్నాలజీ సదస్సులోని ‘ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్’కు వ్యోమగామి శుభాన్షు శుక్లా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను మారతహళ్లి (Marathahalli) నుంచి ఎగ్జిబిషన్ సెంటర్‌కు దాదాపు మూడు గంటలు ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. మూడో వంతు సమయంలోనే తాను తన ప్రసంగాన్ని పూర్తి చేశానని వ్యాఖ్యానించారు.

అంతరిక్ష యాత్ర సవాళ్లతో కూడుకున్నది
గత జూన్‌లో యాగ్జియం మిషన్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేసిన అనుభవాన్ని ఈ సందర్భంగా శుభాన్షు శుక్లా పంచుకున్నారు. అంతరిక్షంలో అడుగు పెట్టాక మన గుండెపై మోటారు వాహనం ప్రయాణించినట్లుగా ఉంటుందన్నారు. అక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడటానికి కనీసం వారం రోజులు పడుతుందని వివరించారు.
భూమికి తిరిగి వచ్చాక కూడా రెండు వారాల పాటు శరీరం అదుపు తప్పినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. అయితే అంతరిక్ష యాత్ర సవాళ్లతో కూడినప్పటికీ.. ఇది భారతీయ అంతరిక్ష విజయానికి ప్రతీక అని తెలిశాక.. గర్వంగా అనిపించిందన్నారు. మనకు, మన అంతరిక్ష ప్రగతికి హద్దుల్లేవని వెల్లడించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: