దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ‘అఘోరీ శ్రీనివాస్’ వ్యవహారంపై శ్రీ వర్షిణి(Sri Varshini) చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తనకు తెలిసిన అనుభవాలను బయటపెట్టింది. తాను దాదాపు రెండు నెలల పాటు శ్రీనివాస్‌తోనే గడిపినట్లు వెల్లడించింది.
Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్
రోజుకు రూ.30 వేల సంపాదన
ఆ సమయంలో అతడు రోజుకు సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సంపాదించేవాడని శ్రీ వర్షిణి పేర్కొంది. ఆలయాల చుట్టూ తిరుగుతూ తనను కూడా వెంట తీసుకెళ్లేవాడని తెలిపింది. మంచి పేరు, ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో, భక్తులు పెద్ద సంఖ్యలో ఆయనను కలిసేందుకు వచ్చేవారని చెప్పింది.

భక్తుల విరాళాలతో లగ్జరీ జీవితం?
భక్తులు స్వచ్ఛందంగా డబ్బులు అందించేవారని, కొందరు రూ.500, మరికొందరు రూ.వెయ్యి వరకు ఇచ్చేవారని తెలిపింది. అంతేకాదు, కారుకు ఇంధనం నింపడం వంటి ఖర్చులు కూడా భక్తులే భరిస్తారని చెప్పింది. దీంతో అతడికి వ్యక్తిగత ఖర్చులు పెద్దగా ఉండేవి కావని వివరించింది. “అన్నీ ఉచితంగానే లభించేవి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్ కండిషన్(Air condition) వేసుకుని విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండేది” అంటూ ఆమె వ్యాఖ్యానించింది.
ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీ వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు, అఘోరీ శ్రీనివాస్ జీవనశైలి, అతడి ఆదాయ మార్గాలపై పలు సందేహాలకు తావిచ్చాయి. ఇప్పటికే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ అంశం, తాజా వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది. ఈ ఇంటర్వ్యూ అనంతరం అఘోరీ శ్రీనివాస్ వ్యవహారంపై ప్రజల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: