మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు(Coldreff cough) మందు కారణంగా 20 మందికి పైగా చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దగ్గు మందును(Cough medicine) తయారు చేసిన శ్రేసన్ ఫార్మా సంస్థ అనుమతులను తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం రద్దు చేసింది. అంతేకాకుండా, కంపెనీని పూర్తిగా మూసివేయాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read also :Japan PR : జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
దగ్గు మందులో విషపూరిత డైఇథైలిన్ గ్లైకాల్
మరణాల నేపథ్యంలో ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా, సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్(Diethylene glycol) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కంపెనీ సరైన తయారీ పద్ధతులను (Good Manufacturing Practices) అవలంబించలేదని, 300కు పైగా ఉల్లంఘనలను రికార్డు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే కంపెనీ యజమానిని అరెస్టు చేసింది. ఈరోజు ఉదయం ఫార్మా సంస్థకు చెందిన పలు ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా తనిఖీలు నిర్వహించింది.

అధికారుల నిర్లక్ష్యంపై కేంద్ర సంస్థల గుర్తింపు
దగ్గు మందు మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తులో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) గుర్తించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని, కేంద్రం చేసిన సిఫార్సులకు (recommendations) అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తేలింది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే విషపూరితమైన సిరప్ మార్కెట్‌లోకి వచ్చి, పిల్లల మరణాలకు దారి తీసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇతర ఫార్మా సంస్థల్లోనూ తనిఖీలు
ఈ ఘటన నేపథ్యంలో, రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ సంస్థల్లోనూ తనిఖీలు నిర్వహించాలని తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఆదేశాలు జారీ చేసింది.
ఏ దగ్గు మందు తయారీ సంస్థ అనుమతులు రద్దు అయ్యాయి?
కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారు చేసిన శ్రేసన్ ఫార్మా అనుమతులు రద్దు అయ్యాయి.
దగ్గు మందులో ఏ విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది?
సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :