సంక్రాంతి వేళ(Special trains) తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తోంది. భాగ్యనగరం నుండి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతున్న తరుణంలో.. ఈసారి ఆ సంఖ్య ముప్పై లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో పండుగకు కొద్ది రోజుల ముందు మాత్రమే ప్రత్యేక రైళ్లను ప్రకటించే సంప్రదాయం ఉండేది.
Read also: Students : విద్యార్థుల వైఫల్యానికి బాధ్యులు ఎవరు?

గత సంవత్సరం కంటే పెరిగిన రైళ్ల సంఖ్య
కానీ ఈసారి ప్రయాణికుల సౌకర్యార్థం నెల రోజుల ముందే 124 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించారు. జనవరి 24 వరకు విడతల వారీగా మొత్తం నాలుగు వందలకు పైగా రైళ్లు నడపనున్నారు.(Special trains) గత ఏడాది కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ.. అప్పుడు సుమారు 250 రైళ్లతోనే సరిపెట్టారు.ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి నగరాలకు వెళ్లే మార్గాల్లో టిక్కెట్ల గిరాకీ విపరీతంగా ఉండటంతో.. ఆయా మార్గాల్లో అదనపు రైళ్లను నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే కొంత అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ముందస్తు బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బెర్తులన్నీ భర్తీ అవుతుండటంతో.. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారి సంఖ్యను బట్టి మరిన్ని రైళ్లను పెంచే ఆలోచనలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: