తెలంగాణ,(Telangana) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పండగ సీజన్ ప్రారంభమైన వెంటనే రైళ్లపై ప్రయాణికుల తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగలు మొదలైనప్పటి నుంచి రైళ్లకు ఎక్కువ ప్రయాణికులు చాలా ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా, దూర ప్రాంతాల రాకపోకలకు రైళ్లు ప్రధాన మార్గంగా మారుతాయి. ఈ రద్దీని(Special Trains) దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపించడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తిరుపతి, బెంగళూరు, చెన్నై, హౌరా, హజ్రత్ నిజాముద్దీన్ వంటి రూట్లలో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే శబరిమలయ్యప్ప స్వామి దర్శనార్థం కొల్లం, ఇతర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
Read also: Cold Wave: తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

నర్సాపూర్-వికారాబాద్, కాకినాడ-వికారాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే(Special Trains) అధికారులు తెలిపిన ప్రకారం, నర్సాపూర్-వికారాబాద్ మరియు కాకినాడ-వికారాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడిపించనున్నాయి. జనవరి 17, 18, 19 తేదీల్లో రాత్రి 8 గంటలకు నర్సాపూర్ నుండి బయలుదేరే రైళ్లు (నంబర్ 07257/07259/07215) మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వికారాబాద్ చేరుకుంటాయి. వికారాబాద్ నుంచి బయలుదేరే రైళ్లు (నంబర్ 07258/07260/07266) జనవరి 18, 19, 20 తేదీల్లో రాత్రి 9:30 గంటలకు ప్రయాణం ప్రారంభించి, మరుసటి ఉదయం 10 గంటలకు నర్సాపూర్ చేరతాయి.
కాకినాడ-వికారాబాద్ ప్రత్యేక రైళ్లు జనవరి 17, 18, 19 తేదీల్లో సాయంత్రం 6:20 నిమిషాలకు బయలుదేరి, మరుసటి ఉదయం 9:45 నిమిషాలకు వికారాబాద్ చేరతాయి. తిరిగి వికారాబాద్ నుంచి బయలుదేరే రైళ్లు జనవరి 18, 19, 20వ తేదీల్లో సాయంత్రం 6:55 నిమిషాలకు బయలుదేరి, మరుసటి ఉదయం 9:20/9:45 నిమిషాలకు కాకినాడ చేరతాయి. వీటిలో పాలకొల్లు, భీమవరం, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి వంటి స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: