Latest News : దీనికితోడు విద్యాసంస్థలకు సెలవులు రావడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఉత్సాహంగా సొంత ఊళ్లల్లో పండుగలు జరుపుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. దీంతో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని (Latest News) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల గడుపును మరోసారి పొడిగించింది. నవంబర్ 24 వరకు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సొంత ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణీకులకు ప్రయాణం మరింత సౌకర్యం అయింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు
తిరుపతి-సాయినగర్ షిర్టీ మధ్య రాకపోకలు సాగించే (07637/07638) నెంబర్ గల రైళ్ల సేవలు, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడిచే (07219/07220) నెంబర్ గల ప్రత్యేక రైళ్లు నవంబర్ 24 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. వీటితోపాటు హైదరాబాద్-కన్యాకుమారి మధ్య నడిచే (07230/07229) నెంబర్ గల ప్రత్యేక రైలు, కాచిగూడ-మధురై మధ్య నడిచే (07191/07192) నెంబర్లు గల ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. హైదరాబాద్-కొల్లాం మధ్య నడిచే (07193/07194) నెంబర్ గల ప్రత్యేక రైళ్లు తిరుపతి, రేణిగుంట మీదుగా నవంబరు చివరి వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు చెప్పారు.
Read also :