క్యాన్సర్, డయాబెటిస్ వంటి కొన్ని వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల (Medicines) విషయంలో తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔషధాలకు సంబంధించి తప్పుడు, తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో ఏదైనా ప్రాంగణంలో సోదాలు జరపడానికి, అక్కడి ఏదైనా రికార్డును స్వాధీనం చేసుకోవడానికి ఐదు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా నిర్వాహకులు అధికారాలను ఇచ్చింది.
Read Also: PM-SVANidhi: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. గ్యారంటీ లేకుండా రూ.10 వేల లోన్!

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం (అభ్యంతరకర ప్రకటనలు) కింద ఈ చర్యలు తీసుకునే అధికారం ఐదు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా నిర్వాహకులకు కేంద్రం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా నిర్వాహకులకు అధికారాలను అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఔషధ కంపెనీలపై పర్యవేక్షణ పెరుగుతుంది. తప్పుడు ప్రచారాలపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు సరైన వైద్య సమాచారంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: