మొబైల్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ స్పామ్ కాల్స్ (Spam Calls) పెద్ద తలనొప్పిగా మారాయి. రోజుకో కొత్త నెంబర్ నుంచి వచ్చే అనవసర కాల్స్, మెసేజ్‌లు చాలామందిని విసిగిస్తున్నాయి. ఒక నెంబర్‌ను బ్లాక్ చేసినా వెంటనే మరో నెంబర్ నుంచి కాల్ రావడం జరుగుతోంది.. కాల్ కట్ చేసినా పదే పదే డయల్ చేస్తూ వినియోగదారుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ కఠిన రూల్స్ తీసుకొచ్చింది.
Read also: America: ట్రంప్ చేతుల్లోకి వెనెజులా.. భారత్‌కు కలిసొచ్చేనా?
ట్రాయ్ డూ నాట్ డిస్టబ్ (DND) యాప్
ఫైనాన్స్ సంస్థలు ప్రత్యేక నెంబర్లన వాడాలని సూచించడంతో పాటు మొబైల్ వినియోగదారుల కోసం ఓ యాప్‌ను కూడా తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ డూ నాట్ డిస్టబ్ (DND) యాప్‌ను లాంచ్ చేసింది. ట్రాయ్ డీఎన్‌డీ 3.0 పేరుతో యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా స్పామ్ కాల్స్ రాకుండా మీరు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవచ్చు. ఎలాంటి కాల్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారనే ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఇక స్పామ్ కాల్స్ గురించి ట్రాయ్‌కు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది ప్రభుత్వ యాప్ కావడంతో మీ డేటాకు భద్రత ఉంటుంది. ఈ యాప్‌ను నిర్వహించేందుకు టెలికాం కంపెనీలతో కలిసి ట్రాయ్ పనిచేస్తుంది ఇక స్పామ్ కాల్స్ గురించి 1909కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. లేకపోతే cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
-గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ట్రాయ్ డీఎన్‌డీ 3.0 యాప్‌ను సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి -మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపై వెరిఫై చేయాలి -డీఎన్‌డీ రిజిస్ట్రీలో చేరి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు -ఫిర్యాదుల సెక్షన్‌లోకి వెళ్లి స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు -ఫిర్యాదుల స్థితిని యాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: