हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మరో ఘనత సాధించిన ఇస్రో

sumalatha chinthakayala
మరో ఘనత సాధించిన ఇస్రో

న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025 ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది. గతేడాది చివర్లో నింగిలోకి పంపించిన స్పెడెక్స్ ప్రయోగానికి సంబంధించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు స్వయంగా ఇస్రో.. ట్విటర్‌లో వెల్లడించింది. ఇక అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా.. ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే.. ఈ ఘనతను సాధించాయి. తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఇది ఒక చరిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది. 15 మీటర్ల నుంచి 3 మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా.. అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించినట్లు ఇస్రో వెల్లడించింది. భారత్ కంటే ముందు చైనా, రష్యా, అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్‌లో విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీమ్‌కు, దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది.

ఇటీవల గత డిసెంబర్‌ 30వ తేదీన తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60(పీఎస్ఎల్వీ-సీ60) వాహకనౌకలో రెండు శాటిలైట్లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించగా.. అక్కడే వాటిని అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉపగ్రహాలను తాజాగా విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ మేరకు స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియ విజయవతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది.

పీఎస్‌ఎల్‌వీ సీ-60 నింగిలోకి దూసుకెళ్లిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి.. 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ రాకెట్‌ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వాటిని డాకింగ్‌ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు 3 సార్లు ప్రయత్నించారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ డాకింగ్ ప్రక్రియ వాయిదా పడుతూ రాగా.. తాజాగా సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే ఆ రెండు శాటిలైట్ల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకువచ్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో తదుపరి కీలక ప్రాజెక్టులైన భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ 4 ప్రయోగాలకు ఇది తోడ్పాటును అందించనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, ఫైనల్‌లో అడుగుపెట్టింది

ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, ఫైనల్‌లో అడుగుపెట్టింది

లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా!

లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అస్సాంలో సుఖోయ్-30 యుద్ధ విమానం అదృశ్యం!

అస్సాంలో సుఖోయ్-30 యుద్ధ విమానం అదృశ్యం!

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన కోడిగుడ్డు ధర

2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

2024-25 ఏడాదిలో బీజేపీకి ఏకంగా రూ. 6,769 కోట్ల ఆదాయం

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీవీ ఆనంద్ బోస్

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సీవీ ఆనంద్ బోస్

రాబోయే భారీ ఆన్‌లైన్ సేల్స్, ఇలా ముందే ప్లాన్ చేస్తే లాభం

రాబోయే భారీ ఆన్‌లైన్ సేల్స్, ఇలా ముందే ప్లాన్ చేస్తే లాభం

కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు

పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు

నితీశ్ పాలన సువర్ణ అధ్యాయం..అమిత్ షా ప్రశంసలు

నితీశ్ పాలన సువర్ణ అధ్యాయం..అమిత్ షా ప్రశంసలు

కృత్రిమ మేధతో లాభాల పంట!

కృత్రిమ మేధతో లాభాల పంట!

📢 For Advertisement Booking: 98481 12870