క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యాటకులు, ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడం సహజం. సెలవులను కుటుంబ సభ్యులతో గడపాలని, పర్యటనలకు వెళ్లాలని అనుకునే వారు పెద్ద సంఖ్యలో రైల్వేలో ప్రయాణిస్తారు.. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక రైళ్ల (Special trains) ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా.. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
Read Also: Lionel Messi: ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ
ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు
రైలు నంబర్ 07196 చర్లపల్లి నుంచి కాకినాడకు డిసెంబరు 24, 30 తేదీల్లో (బుధ, మంగళవారాల్లో) రాత్రి 7.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07195 కాకినాడ నుంచి చర్లపల్లికి డిసెంబరు 28, 31 తేదీల్లో (ఆది, బుధవారాల్లో) రాత్రి 7.50కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30కి గమ్యం చేరుకుంటుంది. ఈ సర్వీసులు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు సొంతూళ్లకు వెళ్లే కోస్తా ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.డిసెంబరు 16 నుంచి జనవరి 4వ తేదీ వరకు పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని ముఖ్య పట్టణాలకు కూడా ద.మ.రైల్వే వీక్లీ ప్రత్యేక రైళ్ల (Special trains) ను నడిపించనున్నట్లు పేర్కొంది.

తిరుపతి-చర్లపల్లి మధ్య నడిచే రైలు నంబర్ 07000 డిసెంబరు 16, 23, 30 తేదీల్లో ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుంది. దీనికి అనుబంధంగా చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే రైలు నంబర్ 07031.. డిసెంబరు 19 నుంచి జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 3.35కి బయల్దేరుతుంది. ఈ రైలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచుతూ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, వినుకొండ, దొనకొండ, గిద్దలూరు, నంద్యాల, కడప వంటి కీలక స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: