
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల్లో, భారీ అంతరాయం ఏర్పడి, దాదాపు 1000 విమానాలు రద్దు లేదా ఆలస్యం కావడంతో ప్రజలు నానా పాట్లూ పడుతున్నారు. ఆలస్యం కారణంగా వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇండిగో పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నటుడు సోనూ సూద్ (Sonu Sood) స్పందిస్తూ, విమానాశ్రయాల్లోని ఇండిగో సిబ్బంది పట్ల దయతో మెలగాలని ప్రయాణికులను కోరారు.
Read Also: Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది
ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. విమానం ఆలస్యమైతే కలిగే అసహనాన్ని తాను అర్థం చేసుకోగలనని, అయితే ఆ కోపాన్ని సిబ్బందిపై చూపించడం సరికాదని సోనూ సూద్ హితవు పలికారు. “దయచేసి ఇండిగో సిబ్బంది పట్ల దయగా, వినయంగా ఉండండి. విమానాల రద్దు భారాన్ని వారు కూడా మోస్తున్నారు.
వారికి మనం మద్దతుగా నిలుద్దాం” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.ఇండిగో సమస్యల వల్ల తన కుటుంబ సభ్యులు కూడా ఎయిర్‌పోర్టులో దాదాపు 8 గంటల పాటు చిక్కుకుపోయారని సోనూ సూద్ వెల్లడించారు. “అక్కడ ప్రయాణికులు సిబ్బందిపై ప్రదర్శిస్తున్న కోపం, ఆగ్రహం చూసి చాలా బాధేసింది. వారిని తిడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఇది చాలా తప్పు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండిగోకి విజ్ఞప్తి
కౌంటర్ వద్ద నిల్చున్న ఉద్యోగి విమానం రద్దుకు లేదా ఆలస్యానికి కారణం కాదని గుర్తుచేశారు.”ఆ సిబ్బంది కూడా మనలాంటి ఉద్యోగులే. వారు కూడా గంటల తరబడి తిండి, నీళ్లు లేకుండా అందరి కోపాన్ని భరిస్తున్నారు. దయచేసి ప్రశాంతంగా, చిరునవ్వుతో మాట్లాడండి.
సహకరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి” అని సూద్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో, “ఇండిగో, దయచేసి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు” అంటూ సంస్థ యాజమాన్యాన్ని సోనూ సూద్ (Sonu Sood) కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: